Asianet News TeluguAsianet News Telugu

`పుష్ప` ఫస్ట్ సింగిల్‌ `దాక్కో దాక్కో మేక` ఔట్‌.. ఊరమాస్‌ గెటప్‌లో గూస్‌బమ్స్ తెప్పిస్తున్న అల్లు అర్జున్‌

`పుష్ప` చిత్ర రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన ఆగస్ట్ 13న ఏదైనా సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని యూనిట్‌ ప్లాన్‌ చేసింది. అందులో భాగంగా `పుష్ప` చిత్రంలోని తొలి పాటని విడుదల చేశారు. 

allu arjun pushpa movie first single daakko daakko meka out now
Author
Hyderabad, First Published Aug 13, 2021, 11:17 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం `పుష్ప`. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌గా పాత్ర పోషిస్తున్నారు. యాంకర్‌ అనసూయ, హాస్య నటుడు సునీల్‌ కీలక పాత్రలుపోషిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగాన్ని క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయబోతున్నారు. 

ఇదిలా ఉంటే దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని తొలి సాంగ్‌ని ఆగస్ట్ 13(నేడు-శుక్రవారం) విడుదల చేశారు. నిజానికి ఈ సినిమాని ఆగస్ట్ 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్‌వాయిదా పడటంతో సినిమా ఆలస్యమైంది. ఈ కారణంగా రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన ఆగస్ట్ 13న ఏదైనా సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని యూనిట్‌ ప్లాన్‌ చేసింది. అందులో భాగంగా `పుష్ప` చిత్రంలోని తొలి పాటని విడుదల చేశారు. 

ఇదిలా ఉంటే `దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుక్కుంది పీక`అంటూ సాగే పాటని ఐదు భాషల్లో, ఐదుగురు సింగర్స్ పాడటం విశేషం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకంగా కాలంలో ఈ పాటని విడుదల  చేశారు. ఆయా భాషలకు చెందిన సింగర్స్ ఈ పాటని ఆయా భాషల్లో ఆలపించారు. తెలుగులో శివం ఈ పాటని పాడగా, చంద్రబోస్‌ రాశారు. ఈ పాటకి అల్లు అర్జున్‌ ఊరమాస్‌ గెటప్‌లో అదరగొడుతున్నారు. ముఖ్యంగా ఆయన ఎక్స్ ప్రెషన్‌ గూస్‌బమ్స్ తెప్పిస్తున్నాయి. అదే సమయంలో ఈ ప్రపంచ మనుగడని, జీవి మనుగడ కోసం చేసే పోరాటం వంటి అంశాలను ఈ పాటలో మేళవించడం విశేషం. ప్రస్తుతం ఈ పాటకి విశేషమైన స్పందన లభిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios