అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప(Pushpa) మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆడియన్స్ కు స్ట్రాంగ్ మాస్ ట్రీట్ ఇచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టింది. ఐదు బాషల్లో అదరగొట్టింది.

అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప(Pushpa) మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆడియన్స్ కు స్ట్రాంగ్ మాస్ ట్రీట్ ఇచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టింది. ఐదు బాషల్లో అదరగొట్టింది.

అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా.. టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన సినిమా పుష్ప(Pushpa). 2021 డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేసింది. అన్ని భాషల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ఇప్పుడు విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది.

తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ , హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ 50 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 365 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. బన్నీ (Bunny) ఫస్ట్ టైమ్ పుష్ప(Pushpa) మూవీతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ప్రవేశించాడు.ఎంట్రీ ఇవ్వడంతోనే ఈరేంజ్ సంక్సెస్ ను అందుకున్న బన్నీ.. నెక్ట్స్ సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నాడు.
పుష్ప (Pushpa) 50 డేస్ కలెక్షన్స్ కు సంబంధించిన వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన ఫస్ట్ డే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న పుష్ప(Pushpa) మూవీ.. దానిని తట్టుకుని నిలబడింది. ఆతరువాత దూసుకుపోయింది. హిందీలోను అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ నుంచి కూడా బాగానే వసూలు చేసింది. అన్ని భాషల్లో సత్తా చాటింది.

అంతే కాదు ఈ సినిమాలో పాటలు.. బన్నీ మేనరిజం కూడా గట్టిగా వైరల్ అవుతోంది. ఇప్పటీక ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బన్నీ( Allu Arjun) ని ఇమిటేట్ చేస్తూ.. ఈ సినిమాలో పాటలతో వీడియోలు చేస్తున్నారు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ.. పుష్ప (Pushpa)ను ఇమిటేట్ చేస్తూ.. వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు సెకండ్ పార్టు షూటింగుకు రెడీ అవుతోంది.