దర్శకుడు పరశురాం కొన్నేళ్ల క్రితం అల్లు అర్జున్ కోసం ఓ కథను సిద్ధం చేసుకొని ఆయనను సంప్రదించగా.. ముందు తన తమ్ముడు అల్లు శిరీష్ తో ఓ సినిమా చేయమని దాని తరువాత ఆలోచిద్దామని చెప్పాడట.

దీంతో అల్లు శిరీష్ ని హీరోగా పెట్టి పరశురాం 'శ్రీరస్తు శుభమస్తు' వంటి సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అల్లు శిరీష్ కి మంచి హిట్ తీసుకొచ్చింది. ఆ తరువాత బన్నీ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ అయిపోవడంతో పరశురాంతో సినిమా చేయడం కుదరలేదు. కానీ ఆయన మాత్రం గీతాఆర్ట్స్ ని విడిచి పెట్టలేదు.

విజయ్ దేవరకొండ హీరోగా 'గీత గోవిందం' సినిమా రూపొందించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఆయన తదుపరి సినిమా కూడా గీతాఆర్ట్స్ లోనే ఉంటుంది. హీరో ఎవరనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇది ఇలా ఉండగా.. పరశురాంతో కలిసి పని చేయడానికి అల్లు అర్జున్ సిద్ధంయ్యాడట.

అయితే త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తరువాతే చేస్తానని చెప్పాడట. కొద్ది నెలల పాటు పరశురాంని ఎదురుచూడమని చెప్పినట్లు సమాచారం. ఈలోగా పరశురాం కూడా ఓ  సినిమాను పూర్తి చేసి బన్నీ సినిమాతో నెక్స్ట్ సినిమా తీయొచ్చు. వచ్చే ఏడాదిలో అల్లు అర్జున్, పరశురాంల కాంబో తప్పకుండా ఉంటుందని అంటున్నారు.