టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో కొత్త ఇంటికోసం ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ప్రతి విషయంలో స్టైలిష్ గా ఆలోచించే అల్లు హీరో కాస్ట్లీ ఇల్లు కోసం నేడు భూమి  పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. తన కుటుంబ సభ్యులతో పూజ చేసిన అల్లు అర్జున్ అందుకు సంబందించిన ఒక స్పెషల్ పిక్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. 

ఇక ఆ కొత్త ఇంటికి బ్లెస్సింగ్ అనే ఒక పేరు కూడా పెట్టాడు. బన్నీ పోస్ట్ చేసిన ఫొటో నిమిషాల్లో వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా అల వైకుంఠపురములో.. షూటింగ్ లో బిజీగా పాల్గొన్న బన్నీ ఫైనల్ గా షెడ్యూల్ కి గ్యాప్ ఇచ్చి కొత్త ఇంటి పనులను మొదలుపెట్టాడు. కోట్లు ఖర్చు పెట్టి ఇంటి కన్స్ట్రక్షన్స్ వర్క్స్ జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నాలిజీ కూడా స్ట్రాంగ్ గా వాడుతున్నట్లు సమాచారం. 

ఇక బన్నీ అల వైకుంఠపురములో సినిమా విషయానికి వస్తే.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సుశాంత్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

BLESSING

A post shared by Allu Arjun (@alluarjunonline) on Oct 2, 2019 at 11:20pm PDT