Asianet News TeluguAsianet News Telugu

డై హార్డ్ ఫ్యాన్ కి బన్నీ సాదర ఆహ్వానం

200 కిలోమీటర్లు కాలినడక తన కోసం వచ్చిన వీరాభిమానిని అల్లు అర్జున్ తన నివాసంలో కలిశారు. ఆ అభిమానితో ఆయన కాసేపు ముచ్చటించడంతో ఓ మొక్కను బహుమతిగా ఇచ్చారు. 
 

allu arjun meets his die hard fan at his residence ksr
Author
Hyderabad, First Published Oct 3, 2020, 3:29 PM IST

అభిమానానికి హద్దులు వుండవు, తమ హీరో కోసం ఎంత వరకైనా వెళతారు ఫ్యాన్స్. అలాంటి ఓ అభిమాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం ఏకంగా 200 కిలీమీటర్ల పాదయాత్ర చేశాడు. వాస్తవంగా దేవాలయాలకు మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు కాలినడకన వెళతారు. అల్లు అర్జున్ భక్తుడు మాత్రం ఆయన్ని కలవాలనే కోరికతో ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఓ యువకుడు అల్లు అర్జున్ కోసం ఈ సాహసం చేయడం జరిగింది. 

ఈ అభిమాని చాలా సార్లు అల్లు అర్జున్ ని కలవాలని ప్రయత్నించారట. హైదరాబాద్ కూడా వచ్చి బన్నీని చూడాలి, మాట్లాడాలని ప్రయత్నం చేశాడట. ఐతే ఈ అభిమాని అభ్యర్ధన అల్లు అర్జున్ వరకు చేరలేదు. దీనితో బన్నీని కలవాలన్న అతని కోరిక తీరలేదు. దీనితో ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత ఊరి నుండి హైద్రాబాద్ కి పాదయాత్ర చేయడం ద్వారా తన సందేశం అల్లు అర్జున్ కి చేరుతుందని, తనకు కోరిక నెరవేరుతుందని తలచాడు. 

దానితో ఓ బ్యానర్ ఏర్పాటు చేసుకొని మాచర్ల నుండి పాదయాత్ర చేపట్టాడు. ఈ విషయం మీడియా మాధ్యమాలలో రావడం జరిగింది. అలా అల్లు అర్జున్  సదరు వీరాభిమాని గురించి తెలుసుకోవడం జరిగింది. నేడు హైదరాబాద్ చేరుకున్న ఆ అభిమానిని అల్లు అర్జున్ ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి పిలిపించి ఓ మొక్కను తనకు బహుమతిగా ఇచ్చారు. ఆ అభిమానితో అల్లు అర్జున్ ముచ్చటించడం జరిగింది. ఈ సంఘటన తన చిరకాల కోరిక తీర్చిందని ఆ అభిమాని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios