Asianet News Telugu

హాట్ టాపిక్: ‘పుష్ప’‌ పార్ట్ 1 రిలీజ్ డేట్

సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తికర అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ మూవీపై మరో వార్త వినిపిస్తోంది. 

Allu Arjun In Plans To Lock Dec 24th As Pushpa 1 Release? jsp
Author
Hyderabad, First Published Jul 7, 2021, 10:00 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘పుష్ప’‌. ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. మొదట భాగంలో  బన్ని ... డ్రైవర్ గా  కనపడనున్నాడని సమాచారం. ఈ చిత్రంలో బన్నీ పాత్ర పేరు ‘పుష్పరాజ్‌’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ సికింద్రాబాద్‌లో మొదలైంది. 45 రోజులపాటు ఏకధాటిగా సాగే సుదీర్ఘమైన ఈ షెడ్యూల్‌ చిత్రీకరణతో తొలి భాగం సినిమా పూర్తి కానున్నట్టు సమాచారం. పూర్తిగా డీగ్లామర్‏ రోల్‏లో బన్ని కనిపించబోతుండడంతో.. పుష్ప కోసం అభిమానులు రిలీజ్ డేట్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. 

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని డిసెంబర్ 24, 2021 న రిలీజ్ చేయటానికి విడుదల తేదీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బన్నీ మొదట డ్రైవర్ గా పని చేసి  తర్వాత కాలంలో స్మగ్లర్‌గా మారతాడట. అయితే ఆ క్రమంలో డ్రైవర్ టు స్మగ్లర్ అనేది  ఎలా మారాడు? ప్రత్యేకంగా చూపించారని తెలిసింది. ఆ సీన్స్ ని ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించడంతో పాటు స్మగ్లర్ల జీవన విధానాన్ని ఆవిష్కరించనున్నారట. అలాగే ఈ కథలో భాగంగా.., ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఎన్ని మార్గాల ద్వారా చేస్తారనేది కూడా చాలా ఇంట్రస్టింగ్ గా చిత్రీకరిస్తున్నారట.  

మరో ప్రక్క ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశం కోసం భారీ బడ్జెట్‌ కేటాయించారు. ఇందులోని ఆరు నిమిషాల సన్నివేశం కోసం రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చిత్ర టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సీన్‌ సినిమాలోనే హైలైట్‌గా నిలుస్తుందని పేర్కొంది. అంతేకాదు ఈ సినిమా కోసం కేవలం భారత్‌ దేశంలోని టెక్నీషియన్స్ తో  మాత్రమే పనిచేయబోతున్నారు. ఇది మేడిన్‌ ఇండియా ప్రాజెక్టని, భారత్‌లోని కళాకారులకు ఉపాధి కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని యూనిట్‌ పేర్కొంది.  ఈ చిత్రం ఎమోషన్స్, కొన్ని వాస్తవిక సంఘటనలతో మిళితమై ఉంటుంది. అదే ప్లస్ పాయింట్ కానుంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతోంది.

‘అల వైకుంఠపురములో..’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న సినిమా ఇది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక హీరోయిన్. ప్రకాశ్‌రాజ్‌, జగపతిబాబు,  వెన్నెల కిశోర్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా   నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ ‌స‌ంగీతం అందిస్తున్నాడు.  తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios