`బిగ్ బాస్ 7` షోపై అల్లు అర్జున్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. చెత్త షో అంటూ పోస్ట్..
Bigg Boss షోపై తాజాగా అల్లు అర్జున్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బన్నీతో `వరుడు` చిత్రంలో నటించి మెప్పించింది భాను శ్రీ మెహ్రా. తెలుగులో పలు చిత్రాల్లో మెరిసింది.

బిగ్ బాస్ షో.. ఇండియాలో దాదాపు ఆరు భాషల్లో రన్ అవుతుంది. విదేశాల్లో ప్రారంభమైన ఈ రియాలిటీ షోని ఇండియన్స్ అక్కున చేర్చుకున్నారు. హిందీలో సక్సెస్ కావడంతో ఇది సౌత్‌కి కూడా పాకింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ షో రన్ అవుతుంది. అయితే ఈ షో మైండ్ లెస్ గేమ్ అని, ఎలాంటి ప్రయోజనం లేని గేమ్ అని, బూతు షో అని ఇలా రకరకాలుగా విమర్శలు వచ్చాయి. కొన్ని పొలిటికల్ పార్టీలు కూడా విమర్శలు చేశాయి.
అయినా ఆదరణ పొందుతుంది. ఇంకా రాను రాను ఈ షోని చూసే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం తెలుగులో ఏడో సీజన్ రన్ అవుతుంది. ఎనిమిది వారాలు పూర్తి చేసుసుకుంది. ఎనిమిది మంది హౌజ్‌ని వదిలారు. ఈ నేపథ్యంలో ఈ షోపై తాజాగా అల్లు అర్జున్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బన్నీతో `వరుడు` చిత్రంలో నటించి మెప్పించింది భాను శ్రీ మెహ్రా. తెలుగులో పలు చిత్రాల్లో మెరిసింది.
తాజాగా ఆమె `బిగ్ బాస్` షో చెత్త షోగా వర్ణించింది. ఈ షోని జనాలు ఎలా చూస్తారో తనకు అర్థం కావడం లేదని, అది తనకు ఆశ్చర్యంగా ఉంటుందని తెలిపింది. దీనికితోడు ఎప్పటికప్పుడు కొత్త సీజన్లు వస్తూనే ఉన్నాయని, తన దృష్టిలో ఇదొక చెత్త షోగా వర్ణించింది. మనసుని కదిలించే షో అని తెలిపింది. తన ఇన్ స్టా ఫీడ్ మొత్తం బిగ్ బాస్ షోకి సంబంధించిన వీడియోలతోనే నండిపోయిందని ఆమె వెల్లడించింది. ఈ మేరకు భాను శ్రీ ట్వీట్(ఎక్స్) చేసింది.
ఇక `వరుడు` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది భాను శ్రీ మెహ్రా. ఆ సినిమా డిజాప్పాయింట్ చేసింది. కానీ ఈ బ్యూటీ పాపులర్ అయ్యింది. ఇందులో హీరోయిన్ పరిచయం చాలా క్రేజీగా నిర్వహించారు మేకర్స్. ఆ తర్వాత `డింగ్ డాంగ్ బెల్`, `బ్రదర్ ఆఫ్ బొమ్మాళి`, `అలా ఎలా?`, `రన్`, `మిస్ ఇండియా`, `టెన్త్ క్లాస్ డైరీస్` చిత్రాలు చేసింది. `గోవిందుడు అందరివాడేలే`లో గెస్ట్ గా మెరిసింది. ఇటీవల `లియో`లోనే చిన్న పాత్రలో మెరిసింది భాను. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు. ఈ క్రమంలో బిగ్ బాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలచిందీ హాట్ బ్యూటీ.