వ్యక్తిగత కారు డ్రైవర్ కి అల్లు అర్జున్ లక్షల రూపాయల సహాయం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అల్లు అర్జున్ ఔదార్యం గురించి అందరూ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.
కారు డ్రైవర్ కల నెరవేర్చడంలో తన వంతు సహాయం చేసి అల్లు అర్జున్ తన మంచి మనసు చాటుకున్నారు. ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న తన డ్రైవర్ కి లక్షల రూపాయలు అందించారు. విషయంలోకి వెళితే వరంగల్ కి చెందిన మహిపాల్ పదేళ్లుగా అల్లు అర్జున్ వ్యక్తిగత డ్రైవర్ గా పని చేస్తున్నాడు. నమ్మకస్తుడైన మహిపాల్ అంటే అల్లు అర్జున్ కి ప్రత్యేకమైన అభిమానం. ఈ క్రమంలో చాలా కాలంగా కుటుంబంతో పాటు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న మహిపాల్ సొంతగా ఇల్లు నిర్మాణం చేపట్టాడు.
డ్రైవర్ గా సంపాదించిన డబ్బులు కూడబెట్టి సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని బోరబండలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ విషయం అల్లు అర్జున్ కి తెలియడంతో రూ. 15 లక్షల చెక్ అందించాడట. ఇంటి నిర్మాణ ఖర్చులకు వాడుకోమని ఆర్థిక సహాయం చేశాడట. దాంతో మహిపాల్, అతని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ కి ధన్యవాదాలు తెలిపారట. డ్రైవర్ సొంతింటి కల నెరవేర్చడం కోసం అల్లు అర్జున్ తన వంతు సహాయం చేశాడు.
ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అలాగే కేరళకు చెందిన ఒక నర్సింగ్ స్టూడెంట్ ని అల్లు అర్జున్ దత్తత తీసుకున్నాడు. కోవిడ్ కారణంగా ఆ విద్యార్థిని తండ్రి మరణించాడు. దీంతో చదువుకు ఆటంకం ఏర్పడింది. ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉందని తెలుసుకొని సదరు స్టూడెంట్ ని దత్తత తీసుకున్నాడు. ఆ స్టూడెంట్ చదువు పూర్తి అయ్యే వరకు ఖర్చు మొత్తం భరిస్తానని హామీ ఇచ్చారు.
ఇక అల్లు అర్జున్ ఔదార్యం గురించి సోషల్ మీడియా జనాలు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఏమైనా అల్లు అర్జున్ ప్రత్యేకం అంటున్నారు. కోట్ల సంపాదన ఉన్నప్పటికీ దానం చేయాలనే గుణం కొందరికే ఉంటుంది అంటున్నారు. కాగా త్వరలో పుష్ప 2 షూట్ ప్రారంభం కానుంది. పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా రేంజ్ లో హిట్టైన నేపథ్యంలో సీక్వెల్ పై అంచనాలు ఏర్పడ్డాయి.
