మెగాస్టార్ తరువాత ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన నెక్స్ట్ జెనరేషన్ హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ హీరోగా హిట్స్ అందుకుంటున్నా.. మెగా క్యాంప్ లో ఈ తరం టాప్ స్టార్ తానే అనే అభిప్రాయంలో ఉండేవాడు అల్లు అర్జున్.

కానీ రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా విడుదలైన వెంటనే మెగాభిమానుల అటెంన్షన్ మొత్తం చరణ్ వైపు తిరిగింది. రీసౌండ్ వచ్చే హిట్టు కొట్టిన చరణ్ మంచి స్క్రిప్ట్ పడితే తన టాలెంట్ ఇది అని నిరూపించుకున్నాడు. అదే సమయంలో అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

'డీజే' సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇలా రెండు సినిమాలు నిరాశ పరచడంతో బన్నీ డీలా పడ్డాడు. తన తదుపరి సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. ఈలోగా చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా విడుదలవుతుందని ఎదురుచూస్తున్నాడు అల్లు అర్జున్.

ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయితే గనుక అల్లు అర్జున్ తన తదుపరి సినిమా విషయంలో అసలు కాంప్రమైజ్ కాలేడు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ వస్తే తప్ప సెట్స్ పైకి కూడా వెళ్లలేడు. అలా బన్నీ తన తదుపరి సినిమా నిర్ణయాన్ని 'వినయ విధేయ రామ' సినిమా రిజల్ట్ పై ఆధారపడేలా చేసుకున్నాడు.