టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల లగ్జరీ కార్వాన్ డిజైన్ చేయించుకొని వార్తల్లో నిలిచాడు. ఆ కార్వాన్ కి 'ఫాల్కన్' అనే పేరు కూడా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో బన్నీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడని టాక్. ఇది ఇలా ఉండగా.. తాజాగా బన్నీ సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బన్నీ వ్యక్తిగత స్టాఫ్ కి సంబంధించిన ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో ఒక పార్టీ ఫోటో షేర్ చేశాడు.

దీనిపై బన్నీ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రతీ ఆదివారం ఉదయం లేచి చూస్తే.. శనివారం రాత్రి తన స్టాఫ్ మెంబర్స్ అందరూ పార్టీ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయని.. తన కంటే వాళ్ల లైఫ్ సంతోషంగా సాగిపోతుందని అన్నారు. చివర్లో 'నన్ను కూడా పార్టీకి పిలవొచ్చు కదా' అనే కామెంట్ జోడించాడు.

టాలీవుడ్ లో బన్నీ తన పెర్సనల్ స్టాఫ్ ని బాగా  చూసుకునే హీరోల్లో ఒకడని మంచి పేరుంది. తన కెరీర్ లో తన వెంటే ఉండి సహకరించిన బన్నీ వాసు, ఎస్కేఎన్ వంటి వాళ్లను నిర్మాతలుగా మార్చి వారి ఎదుగుదలకు సహాయం చేస్తున్నాడు.