గతేడాది ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న, అనేక మందిని ప్రభావితం చేసిన 25మంది యువ డైనమిక్‌ ఇండియన్స్ లిస్ట్ ని ప్రముఖ ఇండియన్‌ బేస్డ్ అమెరికన్‌ మేగజీన్‌ జిక్యూ ఇండియా ప్రకటించింది. ఇందులో బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ, టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చోటు సంపాదించారు. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ భార్యగా, బాలీవుడ్‌ నటిగా అనుష్క శర్మ గతేడాది ఇండియన్స్ ని అటు సోషల్‌ మీడియాలోనూ, ఇటు పలు విశేషాల కారణంగా ఎంతగానో ప్రభావితం చేశారట. ఆమె ప్రెగ్నెంట్‌ అనేది కూడా అందులో భాగమే.

అలాగే `అలవైకుంఠపురములో` సూపర్‌ హిట్‌ కావడం, ఈ చిత్ర పాటలు వంద మిలియన్స్ కి పైగా వ్యూస్‌ని సాధించడం వంటి కారణాలతో బన్నీని ఎంపిక చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి అల్లు అర్జున్‌, అనుష్క శర్మలు ఎంపిక కావడం విశేషం. విభిన్న రంగాలకు చెందిన వారిని ఈ లిస్ట్ లో ఎంపిక చేశారు. గతేడాది కరోనా కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తాయి. కొన్నాళ్లపాటు ప్రపంచమే ఆగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా వీరి గురించిన చర్చ జరిగింది. ఇందులో అనుష్క శర్మకి ఐదో స్థానం దక్కగా, విరాట్‌ కొహ్లీకి 16వ స్థానం దక్కింది. 

ప్రస్తుతం అల్లు అర్జున్‌ `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా దీన్ని దర్శకుడు సుకుమార్‌ రూపొందిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం చిన్న గ్యాప్‌ తీసుకున్నారు. మరోవైపు అనుష్క శర్మ గత నెలలో పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. పాపకి వామిక అనే పేరు పెట్టారు.