అందుకోసం తన కొడుకు బన్నిని సైతం రంగంలోకి దించుతున్నారు అల్లు అరవింద్. ఈ మేరకు అతి త్వరలోనే యాడ్స్ రెడీ కానున్నాయి. అల్లు అర్జున్ సీన్ లోకి వస్తే మొత్తం మారిపోతుందంటున్నారు.
రీసెంట్ గా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ .. `ఆహా` పేరుతో ఓ కొత్త ఫ్లాట్ ఫామ్ ని తెలుగులో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈ ప్లాట్ ఫామ్ ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఆ ప్రమోషన్ సరిపోతున్నట్లు లేదు. అందుకోసం తన కొడుకు బన్నిని సైతం రంగంలోకి దించుతున్నారు అల్లు అరవింద్. ఈ మేరకు అతి త్వరలోనే యాడ్స్ రెడీ కానున్నాయి. అల్లు అర్జున్ సీన్ లోకి వస్తే మొత్తం మారిపోతుందంటున్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ మొత్తం ఈ ఫ్లాట్ ఫామ్ వైపు మ్రొగ్గు చూపుతారు. ఇదిలా ఉంటే చిరంజీవిని సైతం ఈ ప్రమోషన్ కు దింపే ఆలోచనలో అల్లు అరవింద్ ఉన్నారట. ఎలాగైనా ఆహా ని నెంబర్ వన్ చేయాలనే పట్టుదలతో అల్లు అరవింద్ ప్లాన్స్ చేస్తున్నారని సమాచారం.
ఇక నేటి యువత ఆలోచనలను, అభిరుచికి తగిన విధంగా కొత్త కంటెంట్‌తో సినిమా రంగానికి ధీటుగా `ఆహా ఓటీటీ` ఫ్లాట్ ఫామ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇన్నాళ్లూ ఇతర భాషలకు చెందిన ఓటీటీ ఫ్లాట్‌పామ్స్‌ను చూసినవాళ్లు ..తొలిసారి 100 శాతం పక్కా తెలుగు కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకుల అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారట. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యూచర్‌లోనే బిగ్గెస్ట్ గేమ్ చేజింగ్ అనౌన్స్‌మెంట్ `ఆహా ఓటీటీ` అని చెప్తున్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ``ఏడాది క్రితం ఓ మీడియం మన సినిమాలను తినేస్తుందేమో అనే భయంతో ఆహా ఓటీటీ ప్రయాణం మొదలైందని చెప్పవచ్చు. దీన్ని ఓ శత్రువుగా చూడటం కన్నా.. దానిలో మంచి తనాన్నో మరేదైనా కానీ.. మన అచ్చ తెలుగువారికి తెలుగు కంటెంట్‌ను చూపిస్తే బావుంటుందని అనుకున్నాను. ఓసారి మై హోమ్ రామేశ్వర్‌రావుగారితో, రామ్‌తో ఈ విషయం గురించి మాట్లాడితే.. వాళ్లు వెంటనే తమ మద్దుతుని ఇస్తూ పార్ట్‌నర్స్‌గా మారారు. ఇందులో మరికొంత మంది ఎగ్జయిటింగ్ పార్ట్‌నర్స్ కూడా ఉన్నారు.
ఇక అహాను పెట్టబోతున్నానని మా అబ్బాయిలకు చెప్పగానే నాన్న నువ్వు రేపటిని చూస్తున్నావని అన్నారు. టెక్నాలజీ బిజినెస్ గురించి మా కోల్‌కతా స్నేహితుల సపోర్ట్ తీసుకున్నాను. అలాగే ఓ అమెరికన్ కంపెనీ కూడా సపోర్ట్ అందిస్తున్నారు. డిజిటల్ రంగానిదే భవిష్యత్తు. సినిమా ప్రేక్షకుల మనసులను ఎంతలా హత్తుకుంటుందో.. డిజిటల్ కూడా అంతేలా హత్తుకుంటుంది. ఎవరైనా ఈ మీడియంలోకి రావాలనుకుంటే సందేహించవద్దు.
దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జాగర్లమూడి క్రిష్. నేను నా ఆలోచన చెప్పగానే తనకు తానుగా షో చేస్తానని ముందుకు వచ్చాడు. అన్వేష్ ప్యూర్ తెలంగాణ సినిమాలో నటిస్తూ డైరెక్ట్ చేశాడు. అలాగే వైవా హర్ష, డైరెక్టర్ ప్రశాంత్ సపోర్ట్‌తో ఇప్పుడు నాలుగు షోస్‌ను స్టార్ట్ చేశాం. ఈ ఏడాదిలో 25 షోస్‌ను చూస్తారు. కొన్ని సినిమాలు కూడా ఇందులోకి వస్తాయి.
ఇది మాకు కొత్త. ఏదీ కరెక్టో తెలియదు. కాబట్టి అందరూ సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అజయ్ ఠాకూర్ దీన్ని అంతటినీ హ్యాండిల్ చేశాడు. ఇందులో కంటెంట్ బోల్డ్‌గా ఉంటుంది. మనం ఎలా వ్యవహరిస్తామో? ఎలా మాట్లాడుతామో? ఈ మీడియాలో చూపిస్తున్నాం. కాబట్టి పేరంట్ కంట్రోలింగ్ సిస్టమ్ ఉండేలా చూసుకోండి`` అన్నారు.
