Asianet News TeluguAsianet News Telugu

సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ షార్ట్ ఫిల్మ్ , కెరీర్ బిగినింగ్ లోనే దుమ్మురేపిన లక్కీ కాంబో

ప్రస్తుతం  అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆడియన్స్ లో ఆ రేంజ్ లో క్రేజ్ కూడా ఉంది. అయితే వీరి కాంబినేషన్ గురించి ఎవరికి తెలియని ఓ విషయం ఈ మధ్య బయటకు వచ్చింది. అదేమిటంటే..?  
 

Allu Arjun  acted in a short film directed by Pushpa filmmaker Sukumar
Author
First Published Sep 13, 2022, 3:09 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-జీనియస్ డైరెక్టర్ సుకుమార్  ప్రస్తుతం పుష్ప  సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న వీరు..  పుష్ప2 గురించి గట్టిగానే ప్లానింగ్ కూడా చేస్తున్నారు. ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా.. సంచలన విజయంతో పాటుగా తాజాగా సైమా అవార్డ్స్ కూడా తన హవా కొనసాగించింది. ఏకంగా ఆరు అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఫస్ట్ టైమ్  పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాందిచుకున్నాడు  అల్లు అర్జున్.  సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ కు కూడా క్రేజ్ భారీగా పెరిగి పోయింది. అయితే రీసెంట్ గా వీరిద్దరి కాంబో గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 

కెరీర్ బిగినింగ్ నుంచి నటనతో టాలీవుడ్ లో స్టార్ స్థాయికి ఎదిగాడు అల్లు అర్జున్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో  తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.అటువంటి బన్నీ గురించి ఎవరికి తెలియని విషయం బయటకు వచ్చింది. ఆయన  కెరీర్ ప్రారంభంలోనే ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించాడనే విషయం రీసెంట్ గా తెలిసింది. అది కూడా సుకుమార్ డైరెక్షన్ లోనే నటించారు.  ఐ యామ్ దట్ చేంజ్ అనే టైటిల్ తో ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఎనిమిదేళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్  ఐ యామ్ దట్ చేంజ్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మాత కూడా అల్లు అర్జునే కావడం విశేషం.  మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ  ఫిల్మ్ లో న కర్తవ్యాలు నిర్వర్తించడం కూడా దేశభక్తి. మార్పు మనతోనే మొదలవుతుంది. ఆ మార్పు నేనే. అలా మారండ అని అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఈ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత బన్నీ మాట్లాడారు  షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంటే తనకు ఎంతో గౌరవం ఉంది అన్నారు.

తాను ఎప్పుడూ ఇటువంటి అద్భతమైన మంచి కాన్సెప్ట్ లను ఎంకరేజ్ చేస్తానని.. ఇందులో మేకర్స్  ఉద్దేశ్యాలు గొప్పవి. కొన్నిసార్లు ఈ వాణిజ్య ప్రకటనలు అంత ప్రభావం చూపించవు. నా అభిమానులు, స్నేహితులు, విద్యార్థులు చాలా మంది తమకు తోచినట్టు.. తాము చేయగలిగిన  సోషల్ సర్వీస్ చేస్తున్నారు.  నేను కూడా ఈ సమాజానికి ఏదైనా చేయాలనుకున్నాను. అప్పుడే ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నాను అంటూ గతంలో కామెంట్స్ చేశారు అల్లు అర్జున్. మొత్తానికి అప్పుడు అల్లు చేసిన షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios