Asianet News TeluguAsianet News Telugu

Allu Aravind: భారీ ధరకి అల్లు అరవింద్ కొనేశారు.. ఆ మూవీలో అంత మ్యాటర్ ఉందా..

అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంతో చైతు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య ఈ చిత్రంలో చిన్న పాత్రలోనే నటిస్తున్నప్పటికీ కథకి చాలా కీలకమైన పాత్ర.

Allu Aravind to release Laal Singh Chaddha in Telugu
Author
Hyderabad, First Published Jul 5, 2022, 1:27 PM IST

అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంతో చైతు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య ఈ చిత్రంలో చిన్న పాత్రలోనే నటిస్తున్నప్పటికీ కథకి చాలా కీలకమైన పాత్ర. అమీర్ ఖాన్ తో కలసి చైతు ఈ చిత్రంలో సైనికుడిగా నటిస్తున్నాడు. ఈ మూవీలో వీరిద్దరూ స్నేహితులు. 

ఆగష్టు 11న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ట్రైలర్ కూడానా రిలీజ్ అయింది. కానీ ఇంతవరకు ఈ మూవీపై ఆశించిన బజ్ ఏర్పడలేదు. సినిమా రిలీజ్ అయ్యాక అమీర్ ఖాన్ నటనే ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

ఇదిలా ఉండగా తెలుగులో ఈ చిత్రానికి క్రేజీ డీల్ కుదిరింది. లాల్ సింగ్ చద్దా తెలుగు రిలీజ్ హక్కులని అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. భారీ ధర వెచ్చించి ఆయన ఈ చిత్ర తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రలో రిలీజ్ చేయనున్నారు. 

ఏకంగా అల్లు అరవింద్ లాంటి బడా నిర్మాత రంగంలోకి దిగి ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడంతో అంచనాలు పెరుగుతున్నాయి. లాల్ సింగ్ చద్దాలో ఫ్యాన్స్ ని అలరించే మ్యాటర్ తప్పకుండా ఉండే ఉంటుంది అని అంటున్నారు. 

గతంలో అల్లు అరవింద్.. అమీర్ ఖాన్ తో గజినీ చిత్రాన్ని నిర్మించారు. ఆ మూవీ అమీర్ ఖాన్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. బాలీవుడ్ లో ఆ చిత్రం తిరుగులేని లాభాలు తెచ్చిపెట్టింది. బహుశా ఆ అనుబంధం వాళ్ళ కూడా అల్లు అరవింద్ లాల్ సింగ్ చద్దా చిత్రంపై ఆసక్తి చూపి ఉండొచ్చు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కరీనా కపూర్ ఫీమేల్ లీడ్ గా నటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios