Asianet News TeluguAsianet News Telugu

లక్కంటే అల్లు అరవింద్ దే... పావలా పెట్టుబడికి పది రూపాయల లాభం!

 అల్లు అరవింద్ తెలివైన నిర్మాత అని మరోసారి రుజువైంది. కాంతార చిత్రంతో ఆయన కోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. కాంతార చిత్ర ఓపెనింగ్స్ చూసిన ట్రేడ్ వర్గాలు విస్మయానికి గురి అవుతున్నాయి. 

allu aravind seems to earn ten times more on his investement by kantara
Author
First Published Oct 16, 2022, 5:41 PM IST

రెండు వారాలుగా కన్నడ చిత్రం కాంతార గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన అద్భుత చిత్రాల్లో ఒకటిగా దీన్ని కొనియాడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో కాంతార చిత్రం మారుమ్రోగింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ రెండుసార్లు చూశానంటూ ట్వీట్ చేయడంతో భారీగా హైప్ ఏర్పడింది. ఆ ప్రభావం ఓపెనింగ్ డే స్పష్టంగా కనిపించింది. కాంతార చిత్రం థియేటర్స్ ప్రేక్షకులతో పోటెత్తాయి. ముఖ్యంగా అర్బన్, సెమి అర్బన్ ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ వెలిశాయి. 

కనీసం హీరో హీరోయిన్ దర్శకుడు ఎవరో కూడా తెలియకుండా సినిమా కోసం ప్రేక్షకులు క్యూ కట్టారు. కాగా కాంతార చిత్ర తెలుగు హక్కులను నిర్మాత అల్లు అరవింద్ కొన్నారు. ఈ క్రమంలో ఆయన భారీ ఎత్తున లాభాలు గడించనున్నారు. కాంతార రైట్స్ కేవలం రూ. 2 కోట్లకు కొన్నట్లు సమాచారం. మొదటిరోజే ఈ మూవీ రూ. 2  కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ. 5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 

సెకండ్ డే ఓపెనింగ్ డేకి మించి వసూళ్లు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫుల్ రన్ లో కాంతార రూ. 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేయవచ్చనేది ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తంగా అల్లు అరవింద్ డబ్బింగ్ మూవీతో పెట్టుబడికి ఐదారు రెట్ల లాభం పొందనున్నారు. ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో నిన్న  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనాలు నమోదుచేస్తుంది.థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది. రిషబ్ శెట్టి రచించి దర్శకత్వం వహించి నటించారు. 

ముఖ్యంగా ఈ "కాంతార"  క్లైమాక్స్ గురించి చెప్పాలంటే వర్ణనాతీతం. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్ధం చూపించాడు రిషబ్ శెట్టి.అప్పటివరకు మామూలుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు.థియేటర్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకునికి ఒళ్ళు గగుర్పుడిచేలా ఈ చిత్ర క్లైమాక్స్ ను మలిచాడు రిషబ్ శెట్టి. తనలో ఉన్న దర్శకుడుని నటుడు డామినేట్ చేసాడు అనేంతలా ప్రేక్షకుడికి మర్చిపోలేని విజువల్ ట్రీట్ ఇచ్చాడు.  సినిమా చూసిన ప్రతి ఒక్కరు "కాంతార" క్లైమాక్స్ గురించి ప్రస్తావించకుండా ఉండలేరు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగు లో కూడా అదే మాదిరిగా విజయఢంకా మోగిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios