సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే నూతన దర్శకులకు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి నిర్మాతలు సినిమా అవకాశాలు ఇస్తున్నారు. అయితే మొదట్లో నిర్మాతలు ఏ హీరోతో కోరితే దర్శకుడు వారితో సినిమాలు చేసేవారు. 

తమ టాలెంట్ ని నిరూపించుకోవడానికి ఆ అవకాశాన్ని వదులుకునే వారు కాదు. అల్లు అరవింద్ బ్యానర్ లో సినిమా అనగానే ముందుగా అల్లు శిరీష్ తో సినిమా చేసి హిట్ కొట్టాలి. ఆ తరువాత అల్లు అర్జున్ తో సినిమా వచ్చే అవకాశాలు ఉంటాయి.

దర్శకుడు మారుతి, పరశురాం అలా సినిమాలు తీసినవారే.. వీరితో బన్నీ సినిమా ఉంటుందని టాక్. అయితే ఇప్పుడు అల్లు శిరీష్ తో సినిమా చేయాలనే కండీషన్ కి దర్శకులు ఒప్పుకోవడం లేదట. ప్రస్తుతం ఇండస్ట్రీలో యువ హీరోలు ఎక్కువగానే ఉండడంతో  అల్లు శిరీష్ తో సినిమా చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు.

హీరోగా ఎన్ని సినిమాలు చేసినా.. శిరీష్ సరైన గుర్తింపు మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో కొత్త దర్శకులు కూడా అతడితో సినిమాలు తీయడానికి జంకుతున్నారు. మరి ఈ అల్లు హీరోకి మరో సినిమా ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి!