అన్నీ అనుకున్నట్లు జరిగితే షో అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రాబోతోంది అని సమాచారం. దీనికోసం అల్లు అరవింద్ ముంబై నుంచి ఒక ప్రత్యేకమైన టీం ని కూడా రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జీ5 లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంస్‌లో హాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు సౌత్ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భషా చిత్రాలు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతూ జనాలకు కావాల్సిన ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నాయి. అయితే తెలుగులో వారు ఎంత ప్రయత్నించినా నిలదొక్కుకోలేకపోతున్నారు. అందుకు కారణం లోకల్ కంటెంట్ తక్కువ ఉండటమే. ఈ క్రమంలో ఆహా వచ్చింది. తెలుగు ఓటీటీలలో టాప్ ప్లేస్‌లో ఉంది ఆహా వెళ్లింది. తెలుగువారికి నచ్చే పోగ్రామ్ లు, షోలతో మంచి కంటెంట్‌తో అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తోంది. మొదట్లో ఈ ఓటీటీ మీద జనాలకి అంత అవగాహన గానీ, ఆసక్తి గానీ లేదనే చెప్పాలి. అయితే మెల్లిమెల్లిగా మళయాళ డబ్బింగ్ సినిమాలుతో అలవాటు చేసారు. ఆ తర్వాత 'అన్ స్టాపబుల్' వచ్చినప్పటి నుంచి ఓటీటీలపై జనాలకు విపరీతంగా ఆసక్తి పెరిగింది. ఆహా ఓటీటిలలో కంటెంట్ బేస్డ్ సినిమాలు వెబ్ సిరీస్‌లు, షోలు బాగా పెరిగాయి. వాటికి ప్రేక్షకాధరణ కూడా బాగా పెరిగింది.
ముఖ్యంగా అల్లు అరవింద్ ఈ మధ్య కాలంలో 'ఆహా' ఓటీటీ సంస్థపైనే పూర్తి దృష్టిపెట్టి పోగ్రామ్ లు రూపొందిస్తున్నారు. ఈ ఫ్లాట్ ఫామ్ కి కావలసిన కొత్త కంటెంట్ కోసం ఆయన అనేక రకాల కాన్సెప్టులను పరిశీలిస్తున్నారు. ఓటీటీ సినిమాలు .. వెబ్ సిరీస్ లపైనే కాకుండా, టాక్ షోలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతూ దూసుకుపోతున్నారు. బాలకృష్ణను యాంకర్ గా పెట్టి 'అన్ స్టాపబుల్' టాక్ షోను ఎనౌన్స్ చేసినప్పుడు అంతా కూడా ఆశ్చర్యపోయారు. అందుకు కారణం అప్పటివరకూ బాలయ్య అలాంటి షోలు చేయకపోవడమే. 'అన్ స్టాపబుల్' విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని, ఇప్పుడు సెకండ్ సీజన్ లో దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ మరో టాక్ షోను డిజైన్ చేయించినట్టుగా తెలుస్తోంది. ఈ టాక్ షోకి వ్యాఖ్యాతగా బ్రహ్మానందం అయితే కరెక్టుగా ఉంటుందనేది ఆయన ఆలోచన. ఆల్రెడీ బ్రహ్మానందాన్ని కలిసి కాన్సెప్టును గురించిన చర్చలు జరిపారనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఫన్నీగా చాలా సరదాగా ఉండేలా ఆ షోను ప్లాన్ చేస్తున్నారని వినికిడి. అందుకోసం ఇప్పటికే ఓ టీమ్ స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసిందిట. ఓటిటిలో జబర్దస్త్ స్దాయిలో ఈ షో పండాలని అరవింద్ భావిస్తున్నారట.
ఇక బ్రహ్మానందం తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతకాలంగా ఆయన సినిమాల సంఖ్యనే తగ్గించారు. అలాంటి ఆయన అల్లు అరవింద్ కాకుండా వేరే ఎవరైనా ఓకే చెయ్యకపోదురు అంటున్నారు. అయితే టాక్ షో చేయడానికి బ్రహ్మీ పూర్తి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, టైమింగ్స్, వీలు, తన ఆరోగ్య పరిస్దితులు చూసుకుని ఒప్పుకుంటారని అంటున్నారు. త్వరలోనే ఎనౌన్సమెంట్ వచ్చినా ఆశ్చర్యం అయితే లేదు.
