ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆస్కార్ అవార్డు సాధించి ఇండియా మొత్తం పులకరించే విధంగా చేశారు రాజమౌళి. దర్శక ధీరుడు జక్కన్న ప్రతిభ, కృషి ఇండియన్ సినిమా కీర్తిని ఆస్కార్ వేదికపై నిలబెట్టాయి.

ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆస్కార్ అవార్డు సాధించి ఇండియా మొత్తం పులకరించే విధంగా చేశారు రాజమౌళి. దర్శక ధీరుడు జక్కన్న ప్రతిభ, కృషి ఇండియన్ సినిమా కీర్తిని ఆస్కార్ వేదికపై నిలబెట్టాయి. నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి, కీరవాణి, ఇతర ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని టాలీవుడ్ తరుపున సత్కరించాలని నిర్మాతల సంఘం, రచయితల సంఘం నిర్ణయించింది. అనుకున్న విధంగా నేడు టాలీవుడ్ పెద్దలు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ ఓ అతిథిగా హాజరయ్యారు. 

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఆస్కార్ మనకి అందనంత దూరంలో ఉంటుంది... మనకు సాధ్యం కాదు అనే భయం అందరిలో ఉండేది. కొన్నేళ్ల క్రితం యుఎస్ వెళ్ళినపుడు టికెట్ కొనుక్కుని ఆస్కార్ హాల్ ని చూశాను. అబ్బా ఇక్కడా అందరూ ఆస్కార్ అవార్డులు అందుకునేది అని సంబరపడ్డాను. కానీ ఈ రోజు రాజమౌళి అండ్ టీం ఆస్కార్ సాధించారు. 

మన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, నా మేనల్లుడు రాంచరణ్, మన లవబుల్ హీరో ఎన్టీఆర్ వీళ్లందరినీ ఆస్కార్ వేడుకలో చూస్తుంటే నా కడుపు నిండిపోయింది అని అల్లు అరవింద్ అన్నారు. ఇక కీరవాణితో నాకు క్షణ క్షణం నుంచి అనుబంధం ఉందని చెప్పారు. రాజమౌళితో నేను మగధీర చిత్రం చేశాను అని ఇక నుంచి గర్వంగా చెప్పుకుంటా అని అల్లు అరవింద్ అన్నారు.