నాగార్జున సినిమాలో అల్లరి నరేష్, కింగ్ కోసం త్యాగం చేసిన అల్లరోడు..
కింగ్ నాగార్జున సినిమాలో అల్లరోడు.. అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఇదే. ఈ ఇద్దరు స్టార్ల కాంబినేషన్ లో మూవీ రాబోతోంది. ఇంతకీ ఆ సినిమా డీటేయిల్స్ ఏంటీ..?

టాలీవుడ్ లో డిఫరెంట్ కాంబినేషన్లకు కొదవ లేదు. ఎవరు ఎప్పుడు ఏస్టార్ తో సినిమా చేస్తారో చెప్పడం కష్టం. అందులోను..ఆ స్టార్ హీరో సినిమాలో ఇంకో స్టార్ ను తీసుకుని సర్ ప్రైజ్ లు ఇస్తుంటారు. ఇక పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో 2 టైర్ హీరోలను తీసుకోవడం కామన్ గా మారింది. ఇక ఈక్రమంలో సీనియర్ హీరో నాగార్జున సినిమాలో అల్లరి నరేష్ నటించబోతున్నట్టు న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కామెడీ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు అల్లరి నరేష్. ఆతరువాత కాస్త డౌన్ అయినా.. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం తనలో వచ్చిన మార్పు.. వరుసఅవకాశాలు తెచ్చిపెడుతోంది. మరీ ముఖ్యంగా మహర్షి సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించిన నరేష్.. ఆసినిమా తరువాత సీరియస్ క్యారెక్టర్లవైపు దృష్టి పెట్టాడు. కడుపుబ్బా నవ్వించే అల్లరి నరేష్.. నాంది సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌కు నాంది పలికి సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ ముందుకు పోతున్నారు.
కామెడీ పాత్రకలకు విరామం ప్రకటించి, భావోద్వేగపూరితమైన కథలను ఎంపిక చేసుకుంటూ ఎమోషనల్ జర్నీ మొదలుపెట్టారు అల్లరి నరేశ్. రీసెంట్‌గా తాను చేసిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు విమర్శకుల ప్రశంసలందుకోవడమే కాక, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి.ప్రస్తుతం సభకు నమస్కారం అనే సినిమాలో చేస్తున్నారు నరేశ్. ఇదిలావుంటే.. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున నా సామిరంగ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ ప్రత్యేక పాత్ర కోసం దర్శక, నిర్మాతలు అల్లరి నరేశ్‌ని సంప్రదించారని తెలిసింది.
ఇక ఈసినిమా ఆఫర్ రావడంతో నరేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. చిన్నప్పట్నుంచీ తను అక్కినేని నాగార్జున వీరాభిమాని కావడంతో... అడగ్గానే మారుమాట్లాడకుండా పచ్చజెండా ఊపేశారట అల్లరి నరేష్. అంతే కాదు అప్పటికే తనకు బిజీ షెడ్యూల్ ఉన్నాకాని.. అప్పటికి డేట్లు కూడా అడ్జెస్ట్ చేసుకున్నాడంట. త్వరలోనే ఈ సినిమాలో అల్లరి నరేశ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.