సెప్టెంబర్ 28న రన్బీర్ కపూర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఓ విహారంలో ఏకాంతంగా సన్ సెట్ ఎంజాయ్ చేస్తున్న ఫోటో పంచుకున్న అలియా భట్(Alia bhatt), హ్యాపీ బర్త్ డే మై లైఫ్ అంటూ ఎమోషనల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం అలియా పోస్ట్ వైరల్ గా మారింది. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన ప్రియుడు రన్బీర్ కపూర్ కి బర్త్ డే విషెష్ తెలియజేశారు. ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఏకాంత ఫోటో పంచుకోవడంతో పాటు మై లైఫ్ అని రన్బీర్ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు. కొన్నాళ్లుగా అలియా భట్, రన్బీర్ డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వీరు బహిర్గతం చేయడం జరిగింది. 


షూటింగ్స్ తో బిజీగా ఉండే ఈ జంట ఖాళీ సమయం దొరికితే విహారాలకు చెక్కేస్తారు. పెళ్లి కాకుండానే టూర్స్ కి వెళుతూ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. గత ఏడాది రన్బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ అనారోగ్యంతో మరణించారు. ఆ సమయంలో అలియా సొంత ఇంటిలో మనిషి దూరం అయినంత వేదన పడ్డారు. రిషి కపూర్ భౌతిక కాయం వద్ద కన్నీరు మున్నీరైన అలియా ఫోటోలు అప్పట్లో ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి.


గత ఏడాదే వీరి పెళ్లి జరగాల్సి ఉండగా, రిషి కపూర్ మరణంతో వాయిదా పడినట్లు సమాచారం. కాగా సెప్టెంబర్ 28న రన్బీర్ కపూర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఓ విహారంలో ఏకాంతంగా సన్ సెట్ ఎంజాయ్ చేస్తున్న ఫోటో పంచుకున్న అలియా భట్, హ్యాపీ బర్త్ డే మై లైఫ్ అంటూ ఎమోషనల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం అలియా పోస్ట్ వైరల్ గా మారింది. 

View post on Instagram