దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తోన్న చిత్రం 'RRR'. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా అలియాభట్ ని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.

షెడ్యూల్స్ ప్రకారం అలియా మరికొద్ది రోజుల్లో షూటింగ్ లో పాల్గోవాలి. కానీ ఆమె ఇప్పట్లో షూటింగ్ కి హాజరు కావడం కుదరదని టీమ్ కి తెలిపినట్లు తెలుస్తోంది. అలానే 'బ్రహ్మాస్త్ర' టీమ్ కి కూడా చెప్పిందట.

దానికి కారణం ఆమె ఆరోగ్యం సరిగ్గా లేకపోవడమే.. ప్రస్తుతం అలియాకి పేగులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ రావడంతో ఆమె షూటింగ్ లో పాల్గొనే పరిస్థితి లేదు. చికిత్స కోసం కొద్దిరోజులు న్యూయార్క్ వెళ్లబోతుంది. కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి ఆ తరువాత ఇండియాకు తిరిగి రానుంది.

ఇదే విషయాన్ని 'RRR' టీమ్ కి వెల్లడించినట్లు సమాచారం. అలియా హ్యాండ్ ఇచ్చేయడంతో ఇప్పుడు మళ్లీ షెడ్యూల్స్ లో మార్పులు చేస్తున్నారు రాజమౌళి. అలియా తిరిగొచ్చిన  తరువాత ఆమె కాల్షీట్ల ప్రకారం షూటింగ్ ప్లాన్ చేస్తారట. ప్రస్తుతం 'RRR' షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో నిర్వహిస్తున్నారు.