సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ చిత్రం అద్భుత విజయం దిశగా సాగుతోంది. జులై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. 70 ఏళ్ల వృద్ధురాలు 25 ఏళ్ల యువతిగా మారిపోయే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరక్కింది. 

ఇటీవల టాలీవుడ్ చిత్రాల రీమేక్స్ బాలీవుడ్ లో ఎక్కువవుతున్నాయి. బాలీవుడ్ నిర్మాతలు ఇప్పటికే ఓ బేబీ చిత్రంపై కన్నేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర రీమేక్ హక్కులు దక్కించుకునేందుకు బోనికపూర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. తన కుమార్తె జాన్వీ కపూర్ తో ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

బోనికపూర్ మాత్రమే కాదు మరికొందరు నిర్మాతలు కూడా ఓ బేబీ రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. అలియా భట్ ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రీమేక్ రైట్స్ ఎవరు దక్కించుకుంటారనే ఆసక్తి నెలకొని ఉంది. 

ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే రానా దగ్గుబాటిని కూడా నటింపజేయాలనే ఆలోచనలో బోనికపూర్ ఉన్నారట. తన కూతురి కోసం బోనికపూర్ ప్రయత్నాలు చేస్తుండగా.. అలియా భట్ రేసులోకొచ్చి అడ్డుగా నిలిచింది.