2021 సినిమా ప్రేక్షకులకు ఓటిటి ప్లాట్ ఫారమ్ ను దగ్గర చేసింది. నిజానికి సిటీల నుంచి టౌన్లకు, చిన్న ఊళ్లకు ఓటిటి 2021 లో బాగా పరిచయం అయింది. దాదాపు అరడజను ఓటిటి సంస్థలు ఇప్పుడు జనాల లోగిళ్లలోకి దూసుకు వచ్చాయి.
ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భట్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఈ అమ్మడు కూడా సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి షారూక్ నిర్మాణ సంస్థతో భాగస్వామ్యంలో సినిమాల్ని నిర్మిస్తోంది. ఖాన్ తో భట్స్ అలయెన్స్ గా దీనిని భావించాలి. ఓ వైపు ఆమె నటించిన ఆర్.ఆర్.ఆర్- గంగూబాయి కతియావాడి - బ్రహ్మాస్త్రా షూటింగ్ లను పూర్తి చేసి రిలీజ్ అవుతున్నాయి. మరో ప్రక్క ఆలియా నిర్మాతగా ‘డార్లింగ్స్’అనే కొత్త ప్రాజెక్టును ప్రకటించడం ఆసక్తిగా మారింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ నటిస్తూ, నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్న చిత్రం ‘డార్లింగ్స్’. ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఇ ప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ చేయబోతోందని వినికిడి. నెట్ ప్లిక్స్, జీ5 రెండూ ఈ చిత్రం రైట్స్ కోసం పెద్ద యుద్దమే చేస్తున్నాయట. ఇంకా డీల్ ఫైనల్ కాలేదని చెప్తున్నారు. అయితే ఆ డీల్ మాత్రం చాలా పెద్ద మొత్తంతో ముడిపడి ఉంటుందని అంటున్నారు. అయితే ఇంత క్రేజీ ప్రాజెక్టుని ఓటిటికు ఎందుకు ఇచ్చేస్తున్నారనేది మాత్రం ఎవరికీ అర్దం కావటం లేదు.
డార్లింగ్స్’ సినిమా ఓ తల్లికూతుళ్ల కథ. ముంబై లాంటి మహానగరంలో ఆ మిడిల్ క్లాస్ మదర్ అండ్ డాటర్ తమ సవాళ్లని ఎలా ఎదుర్కొన్నారు, ఎలా తమకు కావాల్సిన ప్రేమని అందిపుచ్చుకున్నారు అన్నదే కథాంశం. ఇది డార్క్ కామెడీ జానర్ అని తెలిసింది. ఇందులో ఆలియా ఓ కీలక పాత్రను పోషించనున్నారు. జస్మిత్ దర్శకత్వం వహిస్తోన్న ‘డార్లింగ్స్’లో షెఫాలీ షా, రోషన్ మాథ్యూ, విజయ్ వర్మ లాంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌తో కలసి అలియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
