కథానాయకుడి వాల్యూ పెరగాలంటే సినిమాలో విలన్ పాత్ర కూడా చాలా బలంగా ఉండాలి. విలన్ రోల్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నా కూడా చివరికి కథానాయకుడికే క్రెడి దక్కి తీరాలి. ఇకపోతే ఆడియెన్స్ కి కొత్త రుచులు చూపించే దర్శకుడు త్రివిక్రమ్ ప్రతి పాత్రను కథకు లింక్ చేస్తుంటారు.

ఇక ఇప్పుడు అల..వైకుంఠపురములో సినిమాలో కూడా అలాంటి పాత్రలు చాలానే ఉన్నాయట.  యువ హీరో సుశాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రాబు - మలయాళం యాక్టర్ జయ రామ్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించనున్నారు. ఇందులో టబు పాత్రే చాలా బలంగా ఉండనుందట. కథ మొత్తం ఆమె చుట్టే తిరుగుతుందట.

మొత్తంగా బన్నీ హీరోయిజం కంటే కూడా కొన్ని ఎపిసోడ్స్ లో టబు ఎలివేషన్ హై రేంజ్ లో ఉంటుందని టాక్ వస్తోంది. గతంలో అత్తారింటికి దారేది సినిమాలో నదియా పాత్రను ఏ రేంజ్ లో ఎలివేట్ చేశారో స్పెషల్ గా చెప్పానవసరం లేదు.  ఇక ఇప్పుడు అంతకంటే హై లెవెల్లో దర్శకుడు టబు పాత్రను ప్రజెంట్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఆ పాత్ర ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇటీవల విడుదలైన పాటలు సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతికి మూడు నెలల ముందు నుంచే చిత్ర యూనిట్ స్టార్ట్ చేసిన ప్రమోషన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. గీతా ఆర్ట్స్ - హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా అల..వైకుంఠపురములో .. ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.