‘భారత్’గా మారిన అక్షయ్ కొత్త మూవీ పేరు.! నిఖిల్, కమల్ హాసన్ చిత్రాల టైటిల్స్ కూడా మారుతాయా?
ఇండియాను భారత్ గా మార్చాలన్న ప్రతిపాదనల తీసుకొచ్చి న నేపథ్యంలో ఆ ప్రభావం సినిమాలపైనా పడింది. తాజాగా అక్షయ్ కుమార్ కొత్త చిత్రం పేరులో మార్పు చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో మరో రెండు సినిమాల పేర్లు కూడా మార్చుతారా? అనే సందేహాలు నెలకొన్నాయి.

రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే జీ20 సదస్సు విందుకు పంపిన అధికారిక ఆహ్వానంలో 'ప్రెసిడెంట్ ఆప్ ఇండియా'కు బదులుగా 'భారత రాష్ట్రపతి' అని పేర్కొనడం.. దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ప్రతిపాదనలు, వివాదాల ప్రభావం ఇప్పుడు సినిమాలపైనా కూడా కనిపిస్తోంది. ‘ఇండియా’ అనే టైటిల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల పేర్లను మార్చే ఆలోచన మొదలైనట్టు కనిపిస్తోంది.
తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో ‘మిషన్ రాణిగంజ్’ (Mission Ranigunj : The Great Indian Rescue) పేరుతో ఒక సర్వైవర్ థ్రిల్లర్ ని మన మన ముందుకు తీసుకు వస్తున్నారు. ఇది 1989లో జరిగిన నిజ జీవిత విషాద సంఘటన ఆధారంగా తెరకెక్కింది. గతంలో అక్షయ్ కు రుస్తుం రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు టిను సురేష్ దేశాయ్ దీన్ని డైరక్ట్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఇండియాను భారత్ గా మార్చాలనే ప్రతిపాదనల నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ లో మార్పులు చేశారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో Mission Ranigujn : The Great Bharat Rescueగా టైటిల్ ను మార్చారు.
ఈ క్రమంలో దక్షిణాదిలో రూపుదిద్దుుకుంటున్న రెండు పాన్ ఇండియా చిత్రాల టైటిల్స్ లోనూ మార్పులు జరుగుతాయా? అనే సందేహాలు వెలువడుతున్నాయి. కమల్ హాసన్ - శంకర్ కాంబోలో ‘ఇండియన్ 2’ టైటిల్ తో (Indian 2) భారీ స్కేల్లో సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా టైటిల్ లో ఏమైనా మార్పులు ఉంటాయని అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మున్ముందు చిత్ర యూనిట్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలోనే ఉంది. ఈ ఏడాదిచివర్లో లేదంటే.. వచ్చ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇండియా పేరుతో తెలుగులో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న చిత్రం The India House. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిర్మాత విక్రమ్ రెడ్డితో కలిసి కొత్త ప్రొడక్షన్ హౌజ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ వెంచర్ లోనే ‘V మెగా పిక్చర్స్’ బ్యానర్ లో పాన్ ఇండియా స్థాయిలో ‘ది ఇండియా హౌజ్’ రూపుదిద్దుకోనుంది. రీసెంట్ గా ఫ్రీడమ్ ఫైటర్ వీర్ సావస్కర్ (Veer Savaskar) జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్, టైటిల్ ను అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఇండియాను భారత్ గా పిలవాలంటున్న నేపథ్యంలో ఈ చిత్ర టైటిల్ ను కూడా మార్చే అవకాశం ఉందా? అనే సందేహాలు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఆ చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలంటున్నారు.