బెల్లంకొండ చేసిన పాత్రలో అక్షయ్ ఖరారు!?

అక్షయ్ కుమార్ బాలీవుడ్ రీమేక్ రాజాగా మారిపోతున్నారు. ఆయన వరస పెట్టి రీమేక్ సినిమాలపై దృష్టి పెట్టారు. అదో సక్సెస్ ఫార్ములాగా బాలీవుడ్ భావిస్తోంది. రీసెంట్ గా లక్ష్మి అంటూ కాంచనను రీమేక్ చేసిన అక్షయ్ దృష్టి ఇప్పుడో తెలుగు సినిమాపై పడింది.

Akshay Kumar was all set to do Rakshasudu Remake jsp

మామూలుగా ఒక భాషలో హిట్టైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం అనవాయితీగా వస్తోంది.  ఒక భాషలో హిట్ కాబట్టి.. కథ విషయంలో సేఫ్ గేమ్ ఆడొచ్చనేదే సినిమా దర్శకుల అభిప్రాయం. ముఖ్యంగా హిందీ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా ఇక్కడ సౌత్ లో హిట్టైనా సినిమాలకు ఎక్కువ గిరాకీ ఉంది. మనవాళ్లూ హిందీ సినిమాలు గట్టిగానే రీమేక్ రైట్స్ కొంటున్నారు. 

అలా ఇక్కడివి అక్కడికి, అక్కడివి ఇక్కడికి వెళ్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరింత స్పీడు పెరిగింది. తెలుగు సినిమాలకు హిందీ మార్కెట్ యాడ్ అయ్యింది. ఇప్పటికే హిందీలో తెలుగులో హిట్టైన ‘అల వైకుంఠపురుములో’ ‘ఇస్మార్ట్ శంకర్’ తో పాటు పలు చిత్రాలను రీమేక్ చేస్తున్నారు.  ఈ క్రమంలో తాజాగా మరో చిత్రం రీమేక్ కు రంగం సిద్దమైంది. ఆ సినిమా మరేదో కాదు రాక్షసుడు.

ఆ మధ్యన వరస ప్లాఫ్ ల్లో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ కు .. ‘రాక్షసుడు’ ఊపిరి పోసింది. త‌మిళ‌నాట బ్లాక్ బ‌స్టర్ హిట్టుగా నిలిచిన ‘రాచ్చస‌న్’ సినిమాకు ఇది రీమేక్. ‘రైడ్‌, వీర’ చిత్రాల ఫేం రమేష్‌ వర్మ దర్శకత్వం వహించారు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.  హవీష్ లక్ష్మణ్ ప్రొడక్షన్‌లో ఎ స్టూడియోస్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా‌ని హిందీలో స్వయంగా హవీష్ నిర్మిద్దామనుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో హిందీకు రైట్స్ అమ్మేసినట్లు సమాచారం. 

ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కింద ఏకంగా 2.7 కోట్ల భారీ రేటు ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. హీరోగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమా రీమేక్ లో మెయిన్ లీడ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక డైరెక్టర్ గా తెలుగు రీమేక్ ని హ్యాండిల్ చేసిన రమేష్ వర్మ నే త్వరలో హిందీ రీమేక్ ను కూడా చేస్తారని ప్రచారం జరిగినా అది నిజం కాదని తెలుస్తోంది.  ఈ సైకో థ్రిల్లర్ జానర్ మూవీ కచ్చితంగా హిందీ లో అల్టిమేట్ విజయాన్ని సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అప్పుడే బాలీవుడ్ అంచనాలు వేసేస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios