ఒక్కోసారి స్టార్ హీరోలు కాని.. ఎంతటి వారు కూడా వారు చేసే పనులు ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతాయి. ఆడియన్స్ కు  చిరాకు తెప్పిస్తాయి. వారు చేసే మంచి పనులు ఎంత సపోర్ట్ చేస్తారో.. వారు చేసే చెత్త పనులు కూడా అంతే విమర్షిస్తారు ఫ్యాన్స్. ఈక్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన ఓ పనికి మండిపడుతున్నారు అభిమానులు. 


ఒక్కోసారి స్టార్ హీరోలు కాని.. ఎంతటి వారు కూడా వారు చేసే పనులు ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతాయి. ఆడియన్స్ కు చిరాకు తెప్పిస్తాయి. వారు చేసే మంచి పనులు ఎంత సపోర్ట్ చేస్తారో.. వారు చేసే చెత్త పనులు కూడా అంతే విమర్షిస్తారు ఫ్యాన్స్. ఈక్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన ఓ పనికి మండిపడుతున్నారు అభిమానులు. 

స్టార్ సెలబ్రిటీలకు వారి ఫ్యాన్స్ ఎంత విలువ ఇస్తారో.. వారు కూడా అట్లానే నిలబెట్టుకుంటే మంచింది. వారు మంచి పనులు చేసినప్పుడు దేవుడిలా కొలుస్తారు. కష్టంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తారు. వారి ఇంట్లో శుభకార్యాలు జరిగితే.. ఫ్యాన్స్ కూడా వారి ఇంట్లో నే జరిగినంత ఆనందపడుతారు. అలాంటిది.. సెలబ్రిటీలు వారి స్థాయి మరిచి పిచ్చి పిచ్చి పనులు చేస్తే.. అది కూడా డబ్బుకోసం చేస్తే.. అంతే రేంజ్ లో వ్యతిరేకిస్తారు. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై నెటిజన్లు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆయన చేసిన పని ఏంటీ అంటే..? 

ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ ఆమెరికా టూర్ లో ఉన్నారు. అది కూడా ఓ కార్యక్రమం కోసం ఆయన అక్కడికి వెళ్ళారు. ఎంటర్‌టైనర్‌ పేరిట నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అక్షయ్ ఒక్కరే కాదు.. బాలీవుడ్ స్టార్స్ నోరా ఫతేహీ, సోనమ్‌ బజ్వా, మౌనీ రాయ్‌, దిశపటానీ లాంటి ఇంకొంత మంది బాలీవుడ్ స్టార్స్ కూడా కూడా ఆయనతో పాటు టూర్‌లో ఉన్నారు. ఈ టూర్‌లో భాగంగా అక్షయ్‌తో పాటు మిగిలిన వారు డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లు ఇస్తున్నారు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం అట్లాంటాలో ఓ డాన్స్ ఈవెంట్ జరిగింది. గ్యాస్‌ సైత్‌ ఎరినాలో జరిగిన మొదటి డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ లో స్టార్స్ డాన్స్ తో అలరించారు. 

YouTube video player

అయితే ఈ డాన్స్ ఈవెంట్ లో అక్షయ్ కుమార్ చేసిన డాన్స్ వీడియో మాత్రం బాగా వైరల్ అయ్యాయి సోషల్‌ మీడియాలో దానికి కారణం కూడా లేకపోలేదు. ఆ వీడియోల్లో అక్షయ్‌ కుమార్‌ లంగా వేసుకుని ఉన్నారు. ఆ లంగాలోనే మై ఖిలాడీ.. తు అనారీ పాటకు డ్యాన్స్‌ చేశారు. అక్షయ్‌ లంగా వేసుకుని డ్యాన్స్‌ చేయటంపై ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు అంటే వారు ఏం చేసినా.. ఆడియన్స్ స్పందించడానికి ఏ సాధనం ఉండేది కాదు. కాని ఇప్పుడు సోషలక్ మీడియా అందుబాటులో ఉండే వరకూ.. నెటిజన్లు ప్రతీ విషయంలో స్పదిస్తున్నారు. ఈక్రమంలోనే అక్షయ్ డాన్స్ పై కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. 

ఇక అక్షయ్ డాన్స్ విషయంలో నెటిజన్లు స్పందిస్తూ.... ఛీ డబ్బు కోసం మరీ ఇంతలా దిగజారి డ్యాన్స్‌లు వేయాలా?.. ఏంటి ఇది అక్షయ్ అంటున్నారు. సినిమాల ద్వారా డబ్బులు రాకపోతే.. ఇలా లంగాలు వేసుకుని డబ్బులు సంపాదిస్తారా..? అంటూ షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. అక్షయ్ షాకింగ్ వీడియోకు.. షాకింగ్ కామెంట్లు వస్తున్నాయి. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.