అక్షయ్ కుమార్ తన కొత్త చిత్రం ‘కట్ పుట్లి’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొని కొన్ని కామెంట్స్ చేసారు. అవి అంతటా హాట్ టాపిక్ గా మారాయి. తమిళ చిత్రం ‘రాక్షసన్’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘కట్ పుట్లి’ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరక్ట్ గా హాట్ స్టార్ ఓటీటీలో రిలీజవుతోంది.
రీసెంట్ గా రిలీజైన అక్షయ్ కుమార్ సినిమా 'రక్షాబంధన్' డిజాస్టర్ అయ్యిన విషయం తెలిసిందే. మరో ప్రక్క అమీర్ ఖాన్ తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా సైతం అదే పరిస్దితి ఎదుర్కొంది. అలాగే ఈ వారం రిలీజైన తాప్సీ చిత్రం దొబారా సైతం మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దాంతో బాలీవుడ్ లో వరస డిజాస్టర్స్ కు బ్రేక్ పడటం లేదు. తెలుగు నుంచి వెళ్లిన కార్తికేయ 2 చిత్రం అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దాంతో బాలీవుడ్ చాలా నిరాశలో మునిగిపోతోంది. లైగర్ రిజల్ట్ కోసం వారంతా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా హిందిలో హిట్టైనా సౌత్ ఇండియాకే ఆ క్రెడిట్ వెళ్ళిపోతుంది.
ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తన కొత్త చిత్రం ‘కట్ పుట్లి’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొని కొన్ని కామెంట్స్ చేసారు. అవి అంతటా హాట్ టాపిక్ గా మారాయి. తమిళ చిత్రం ‘రాక్షసన్’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘కట్ పుట్లి’ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరక్ట్ గా హాట్ స్టార్ ఓటీటీలో రిలీజవుతోంది.
ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ... రకరకాల కారణాల వల్ల థియేటర్లలో రిలీజవుతున్న హిందీ సినిమాలు ఫెయిలవుతున్న పరిస్థితుల్లో ఇక అన్ని సినిమాలనూ ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తారా అని ఒక విలేకరి అడిగారు. దానికి అక్షయ్ బదులిస్తూ.. థియేటర్లలో సినిమాలు ఆడట్లేదంటే అవి ప్రేక్షకులకు నచ్చలేదని అర్థమని, అందుకు బాధ్యత వహించాల్సిందే తనే అని తేల్చి చెప్పాడు. ఒక సినిమా పట్టాలెక్కడానికి తానే కారణం కాబట్టి అది ఫెయిలైతే తప్పు తనదే అవుతుందని అక్షయ్ అన్నాడు.
ఇప్పుడు మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తాము కూడా మారి, వారికి నచ్చేలా సినిమాలు తీయాల్సిన అవసరం ఉందని అక్షయ్ అభిప్రాయపడ్డాడు. ఎప్పుడూ ప్రేక్షకులను నిందించడానికి వీల్లేదని కూడా తేల్చి చెప్పాడు. తనతో పాటు అందరూ ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతులను పక్కన పెట్టి ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇవ్వాలని అక్షయ్ పిలుపునిచ్చాడు.
అలాగే ‘‘ప్రేక్షకులకు సినిమాల పరంగా ఏం నచ్చుతుందో, వారేం కోరుకుంటున్నారో అర్థం చేసుకుని తదుపరి సినిమాల ద్వారా వారికది అందిస్తా. వచ్చే నెల(సెప్టెంబర్) 2న విడుదల కానున్న ‘కట్‌పత్లీ’(Cuttputlli) ప్రేక్షకులకు ఆ అనుభూతినిస్తుంది. నా కెరీర్‌లో ‘ఖిలాడీ’ మొదటి థ్రిల్లర్ చిత్రం. ఇది అంతకుమించి ఉంటుంది. ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయడం వెనుక కారణం ఈ సినిమా కష్టం అందరికీ చేరాలనే తప్ప రక్షణాత్మక ధోరణి ఎంత మాత్రం కాదు’ అని అన్నారు.
2018లో వచ్చిన తమిళ చిత్రం ‘రాక్షసన్’కు ‘కట్‌పత్లీ’ రీమేక్. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్(Rakul Preet Singh) కథానాయికగా నటించారు. రంజిత్ ఎం తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్2న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఇది కాకుండా అక్షయ్ అయిదారు చిత్రాల షెడ్యూళ్లతో బిజీగా ఉన్నారు.
