Akshay Kumar :ఇలా జరగటం అక్షయ్ కుమార్ కు పెద్ద అవమానమే, ఏం మాట్లాడగలడు?
అనుకున్నట్లుగానే ఈ చిత్రం నెగిటివ్ రివ్యూలతో విడుదలైంది. చాలా మంది బాలీవుడ్ విమర్శకులు ఈ చిత్రాన్ని చాలా దారుణంగా ఆడుకునవ్నారు. ఈ సినిమా వర్కవుట్ కానీ చారిత్రాత్మక డ్రామా అని తేల్చేసారు.
సినిమాలు హిట్ అవుతూంటాయి. ఫ్లాఫ్ అవుతూంటాయి. కాని ఫ్లాఫ్ అయ్యాక ...ఆ క్రెడిట్ మొత్తం హీరోకే చెందితే మాత్రం అంతకు మించిన అవమానం మరొకటి ఉండదు. ఇప్పుడు అక్షయ్ కుమార్ కు అదే జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో తాజాగా నటించిన చిత్రం పృథ్వీరాజ్ . చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించగా.. మానుషీ చిల్లర్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మించింది. ఇటీవల అక్షయ్ చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా మిగలడంతో ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలనే ధ్యేయంతో ఈ సినిమాని చేశాడు. ఈ సమయంలో ఆయన కొత్త చిత్రం జూన్ 3న విడుదలైంది. అయితే మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ వచ్చేసింది.
సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రోమోకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ అక్షయ్ మరియు ఆయన టీమ్ ఆశ కోల్పోలేదు. అంతేకాకుండా ఈ చిత్రంలో హిందుత్వ కోణాన్ని బయటకు తీసుకువచ్చి చాలా ప్రచారం చేసారు. అయితే అనుకున్నట్లుగానే ఈ చిత్రం నెగిటివ్ రివ్యూలతో విడుదలైంది. చాలా మంది బాలీవుడ్ విమర్శకులు ఈ చిత్రాన్ని చాలా దారుణంగా ఆడుకునవ్నారు. ఈ సినిమా వర్కవుట్ కానీ చారిత్రాత్మక డ్రామా అని తేల్చేసారు. దాంతో ఈ చిత్రం నిర్మాతలు యష్ రాజ్ ఫిల్మ్స్ ఇతర మార్గాల్లో డబ్బు రికవరీకి మార్గాలను అన్వేషిస్తోంది. తాజా బాలీవుడ్ హాట్ టాపిక్ ఏమిటంటే, ఈ VFX చిత్రం మరికొన్ని రోజుల్లో డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచినందున, థియేట్రికల్ విడుదలైన 3 వారాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ప్రైమ్ వీడియో నుండి రావాల్సి ఉంది.
ఇక ఈ చిత్రం రిజల్ట్ , ఓటిటిలో ముందే వస్తూండటంతో అక్షయ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా లేరు. అంత గొప్ప రాజు పాత్రను పోషించినా పెద్దగా పట్టించుకోవటం లేదు. అక్షయ్ లుక్స్ మరియు పెర్ఫార్మెన్స్ ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు . సంజయ్ దత్, సోనూ సూద్ వంటి దక్షిణాదిన పాపులారిటీ ఉన్న యాక్టర్స్ నటించిన.. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ విడుదలయ్యింది.