ఆపండి.. ప్రభాస్ కథ వేరే...అక్షయ్ కథ వేరే

ఇప్పుడీ సినిమాకు పోటీగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ  చిత్రాన్ని ప్రకటించారు. ‘రామ్ సేతు’ టైటిల్‌తో ఉన్న ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేసి షాక్ ఇచ్చారు. అయితే ఇది ప్రభాస్ కు పోటీగా కావాలని ప్లాన్ చేసిన సినిమానా కాదా అనే విషయం సోషల్ మీడియాలో చర్చగా మారింది. 

Akshay Kumar announces new film Ram Setu jsp

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్...శ్రీరాముడు జీవితం ఆధారంగా ‘ఆదిపురుష్’ టైటిల్‌తో రీసెంట్ గా ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడని టైటిల్ లుక్ పోస్టర్‌లో చూపించారు. అలాగే విలన్‌గా సైఫ్ అలీఖాన్‌ని ఫైనల్ చేశారు. సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వంటి పాత్రల కోసం ఇప్పుడు వెతుకుతున్నారనే వార్తలు వస్తున్నాయి. 

ఇదే సమయంలో... ఇప్పుడీ సినిమాకు పోటీగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ  చిత్రాన్ని ప్రకటించారు. ‘రామ్ సేతు’ టైటిల్‌తో ఉన్న ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేసి షాక్ ఇచ్చారు. అయితే ఇది ప్రభాస్ కు పోటీగా కావాలని ప్లాన్ చేసిన సినిమానా కాదా అనే విషయం సోషల్ మీడియాలో చర్చగా మారింది. అయితే ఈ కథ మొత్తం రామసేతు చుట్టూ తిరుగుతుందని, ఓ రీసెర్చ్ లాంటి సబ్జెక్ట్ అని చెప్తున్నారు. రామసేతు చుట్టూ ఉన్న అపోహలను పటాపంచలు చేయటానికే ఈ ప్రాజెక్టు తలకెత్తుకున్నాడని అక్షయ్ ని మరికొంతమంది మెచ్చుకుంటున్నారు. ఈ రెండు సినిమాలకు పోటీ ఉండకపోవచ్చు కానీ, పోల్చి చూస్తారని చెప్తున్నారు. 

ఇక రామాయణం నిజంగానే జరిగిందని, రామసేతు మానవ నిర్మిత కట్టడమేనని మూడేళ్ల క్రితం అమెరికన్ సైన్స్ చానల్ ఒకటి కథనం ప్రసారం చేసింది. భారత్-శ్రీలంకలను కలుపుతూ రామాయణ కాలంలో వారధి నిర్మించారని, ఇది నిజమేనని ఆ ఛానల్ తెలిపింది. డిస్కవరీ కమ్యూనికేషన్‌కు చెందిన సైన్స్ ఛానల్ రామసేతు గురించి ప్రత్యేక కథనాన్ని రూపొందించింది. భారత్, -శ్రీలంక మధ్యనున్న అంతర్జాతీయ జలాల్లో ఉన్న రామసేతు వారధి పూర్తిగా సున్నపురాయి (లైమ్‌స్టోన్)తో నిర్మించినది. 

తమిళనాడులోని ఆగ్నేయ ప్రాంతంలోనున్న రామేశ్వరం నుంచి శ్రీలంకలోని వాయువ్య ప్రాంతంలోని మన్నార్ ప్రాంతం వరకూ ఈ వారధిని నిర్మించారు. వారధి నిర్మాణం కోసం ఉపయోగించిన రాళ్లు  నీటి మీద తేలుతూ ఇసుక శక్తితో ధృఢంగా నిలిచాయని చెప్పారు. సైన్స్ చానల్ కథనం కోసం ప్రత్యేకంగా వారధి గురించి దాదాపు 30 మైళ్ల దూరం వరకూ సైంటిస్టులు పరిశోధనలు చేశారు.

 ఈ పరిశోధనల్లోనే ఈ ఆసక్తిర విషయాలు వెలుగు చూసినట్లు తెలిసింది. భారత్-, శ్రీలంకను కలుపుతూ  నిర్మించిన రామసేతు ఇటు శాస్త్రపరిశోధనలు, అటు హిందూ విశ్వాసాల పరంగా చూసిన సత్యమేనని సైన్స్ చానల్ తన కథనంలో ప్రస్తావించింది. ఇవన్నీ రామసేతులో చూపించే అవకాసం ఉందని తెలుస్తోంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios