విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్. సోమవారం అక్షయ్ కుమార్ 52వ జన్మదినం. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఆసక్తికర ప్రకటన చేశాడు. తన తదుపరి చిత్రం గురించి అద్భుత విషయాన్ని తెలిపాడు. 12వ శతాబ్దానికి చెందిన అపరపరాక్రమవంతుడు చక్రవర్తి పృథ్వి రాజ్ చౌహన్ పాత్రలో నటించబోతున్నాడు అక్షయ్ తెలిపాడు. 

తాజాగా ఆ చిత్ర టైటిల్ పృథ్విరాజ్ అని ప్రకటించాడు. పృథ్విరాజ్ క్రీ.శ. 1166లో జన్మించారు. 1192లో మహమ్మద్ ఘోరీ సైన్యం భారత దేశంపై దండెత్తింది. పృథ్వి రాజ్ చౌహన్ వారికి ఎదురునిలిచి ఎంతో ధైర్య సాహసాలని ప్రదర్శించాడు. 

ఆయన పాత్రలో నటించనుండడం తనకు దక్కిన గౌరవం అని అక్షయ్ తెలిపాడు. తన కెరీర్ లోనే ఏఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోందని తెలిపాడు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2020 దీపావళికి పృథ్విరాజ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.