బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో అక్షయ్ కుమార్- ట్వింకిల్ ఖన్నా భేటీ, కారణమేంటంటే..?
ఈమధ్యే తాజాగా బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ ను కలిశారు బాలీవడు స్టార్ హీరో అక్షయ్ కుమార్.. సతీ సమేతంగా ఆయన బ్రిటీష్ ప్రధానిని కలిశారు. ఈ క్రమంలో ఈ కలయికకు సబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్‌ని కలిసారు. ఈ విషయాన్ని స్వయంగా. ట్వింకిల్ ఖన్నా తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు వీరు ఎందుకు కలిశారు. కారణం ఏంటీ..? ఈ ఏజ్ లో కూడా అక్షయ్ కుమార్ భార్య.. మాజీ హీరోయిన్ ట్వీంకిల్ ఖన్నా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అది కూడా లండన్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ పట్టాను తాజాగా పొందారు.
అయితే ఈ కార్రక్రమానికి ఆమె భర్త అక్షయ్ కుమార్ కూడా హాజరయ్యారు. తన భర్త అక్షయ్ కుమార్‌తో కలిసి రకరకాల కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నారు టీమ్. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ జంట బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్‌ను మీట్ అయ్యారు. వీరి మీట్‌కి సంబంధించిన వీడియోను ట్వింకిల్ ఖన్నా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసారు. అయితే ఈ వీడియోలో ఇటాలియన్ సింగర్ ఆండ్రియా బోసెల్లి ప్రదర్శన కూడా కనిపిస్తుంది. వీడియో చివర్లో ట్వింకిల్ రిషి సునక్, అక్షయ్ కుమార్‌లతో ఫోజులిచ్చింది. ఈపోస్ట్ చేసిన ట్వింకిల్ దానిక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. చాలా కూల్ మీటింగ్ అంటూ కామెంట్ చేశారు.
ఇక ట్వింకిల్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె ఇంకాస్త డిఫరెంట్ గా రాశారు. బ్రిటర్ ప్రధాని రుషీ సునాక్ భరత సంతతికి చెందిన వ్యక్తి అని తెలిసిందే.అయితే ఆయన ఇన్ ఫోర్సిస్ వ్యావస్థాపకులు.. నారాయన మూర్తి , సుధామూర్తి కూతురు అక్షతను విహాహం చేసుకున్నారు. అయితే ట్వింకిల్ ఆ విషయన్ని హింట్ ఇస్తు... నా హీరో సుధా మూర్తి.. ఆమె అల్లుడు రిషి సునక్‌ని కలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వింకిల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ట్వింకిల్ ఖన్నా గతంలో తన డిజిటిల్ ప్లాట్ ఫామ్ కోసం సుధామూర్తిని ఇంటర్వ్యూ కూడా చేసారు.