గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాని బన్నీ వాసు నిర్మించనున్నారు. ఈ మేరకు త్వరలో అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాసం ఉంది. 

అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12వ తేదీ విడుదల అయ్యింది. నాగచైతన్య సరసన కృతి శెట్టి నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని ప్రతి ఒక్కరు భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దాంతో చైతూ తన తదుపరి చిత్రం ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 

అయితే అందుతున్న సమాచారం మేరకు చైతూ ముచ్చటగా మూడోసారి డైరెక్టర్ చందు మొండేటికీ అవకాశం ఇవ్వబోతున్నారని ఆయన డైరెక్షన్లోనే తన తదుపరి సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాని బన్నీ వాసు నిర్మించనున్నారు. ఈ మేరకు త్వరలో అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాసం ఉంది. వాస్తవానికి కార్తికేయ 2 తర్వాత చందు బాలీవుడ్ హీరోలతో సినిమా చేస్తున్నట్టు వినపడింది. అయితే అక్కడ హీరో డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో ఈలోగా ఒక సినిమా చేయాలని కథ రెడీ చేసుకున్నారంట.

 ఈ కథను గీత ఆర్ట్స్ 2 ప్రొడ్యూసర్ బన్నీ వాసుకు కథ నచ్చి సినిమా నిర్మించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ కథకు నాగచైతన్య అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని.. తన కూడా స్టోరీ లైన్ చెప్పగానే ఓకే అన్నట్టు సమాచారం. చందు మొండేటి డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు తీసుకువెళ్తారని తెలుస్తుంది.

 గత ఏడాది నిఖిల్ అనుపమ హీరో హీరోయిన్లుగా నటించిన కార్తికేయ2 సినిమా ఎలాంటి విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య తదుపరి సినిమా చేయబోతున్నారని సమాచారం. అయితే ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ప్రేమమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే సవ్యసాచి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమమ్ పరవాలేదు అనిపించుకున్న సవ్యసాచి మాత్రం కాస్త నిరాశను కలిగించిందని చెప్పాలి. ఏదైమైనా ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ కు ఆనందమే. త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుంది.