బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండి లవర్ బాయ్ ఇమేజ్ తో నెట్టుకు వస్తున్నాడు అఖిల్. మోనాల్ ని తన మాయలో పాడేసుకున్న అఖిల్ హౌస్ లో తన మైలేజ్ పెంచుకున్నాడు. వీరిద్దరి అఫైర్, ముద్దుల వ్యవహారం హౌస్ లో ఉండడానికి ప్రధాన కారణం అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా, వీరిద్దరూ హాట్ కంటెస్టెంట్ గా మారడానికి కారణం లవ్ ఎఫైర్ నే. వీరిద్దరి ఎఫైర్ పై హోస్ట్ నాగార్జున కూడా అనేక మార్లు మాట్లాడడం జరిగింది. 
 
బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకోగా మోనాల్, అఖిల్ మధ్య కూడా విభేదాలు రావడం జరిగింది. మోనాల్ ని అఖిల్, అఖిల్ ని మోనాల్ నామినేట్ చేసుకున్నారు. ఈ విషయంలో ఇద్దరు కొంచెం దూరం కావడం జరిగింది. అయితే మోనాల్ మాత్రం అఖిల్ కి దగ్గర కావాలనే చూస్తుంది. మోనాల్ ని లైన్ లో పెట్టడానికి మొదటి నుండి అభిజిత్, అఖిల్ పోటీపడుతున్నారు. మోనాల్ మాత్రం అఖిల్ కే దగ్గరైంది. 
 
ఈ మధ్య అఖిల్, మోనాల్ మధ్య గొడవలు రాగా, అభిజిత్ లవర్ కి అఖిల్ లైన్ వేస్తున్నట్లు అనిపిస్తుంది. సమయం దొరికినప్పుడగా హరికకు అఖిల్ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. హౌస్ లో హారిక అభిజిత్ తో డీప్ లవ్ లోకి వెళ్లారు. వీలు దొరికితే చాలు అతనికి హగ్స్ ఇవ్వడానికి వెనకాడడం లేదు. అలాంటి హరికను అఖిల్, తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.