యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించాడు. కానీ సరైన సక్సెస్ ని అందుకోలేకపోయాడు. గీతాఆర్ట్స్ బ్యానర్ లో తను చేయబోయే సినిమా కచ్చితంగా తనకు సక్సెస్ ఇస్తుందని నమ్ముతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ తన తల్లితండ్రులతో కలిసి మ్యారేజ్ బ్యూరో నడుపుతుంటుంది. కానీ తనకు పెళ్లి చేసుకోవడానికి మాత్రం సరైన అబ్బాయి దొరకక ఎదురుచూస్తుంటుంది. ఈ క్రమంలో ప్లేబాయ్ క్యారెక్టర్ లాంటి హీరో తన లైఫ్ లోకి వచ్చిన తరువాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే అంశాలతో సినిమా నడుస్తుంది.

ఈసారి కూడా అఖిల్ లవ్ స్టోరీనే ఎన్నుకున్నాడు. అతడి సరసన హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోవాలని అనుకుంటున్నారు. సినిమాలో ఎమోషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని అంటున్నారు. ఈ సినిమా సక్సెస్ కావడం బొమ్మరిల్లు భాస్కర్ కి చాలా ముఖ్యం. ఆ కారణంగానే మరింత శ్రద్ధతో కథను సిద్ధం చేస్తున్నాడని సమాచారం.