మొదట్లో మిస్టర్ కూల్ అనిపించుకున్న అఖిల్ మెల్లగా ఆ పాజిటివ్ ట్యాగ్ పోగొట్టుకుంటున్నాడు. కొన్ని విషయాలలో ఆయన ప్రవర్తనా తీరు బిగ్ బాస్ ప్రేక్షకులపై నెగెటివ్ ఇంఫాక్ట్ కలిగేలా చేస్తుంది. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో కూడా అమ్మ రాజశేఖర్ పై అఖిల్ ఫైర్ కావడం జరిగింది. మోనాల్ మరియు అభిజిత్ మధ్య దూరం పెరగడానికి అఖిల్ కారణం అవుతున్నాడని అమ్మ రాజశేఖర్ అఖిల్ ని నామినేట్ చేయడం జరిగింది. 

ఈ కారణాన్ని అఖిల్ ఒప్పుకోలేదు. మోనాల్ అభిజితో మాట్లాడకపోతే నాకు సంబంధం ఏమిటని సీరియస్ అయ్యాడు. అభిజిత్ తో మాట్లాడవద్దని నేను నీకు చెప్పనా అని మోనాల్ ని డైరెక్ట్ గా అడిగాడు. దీనితో పాటు కుమార్ సాయి ఎలిమినేషన్ సమయంలో అఖిల్ తీరును కూడా అమ్మ రాజశేఖర్ తప్పు బట్టడం జరిగింది. ఎలిమినేటైన వారు చాల బాధలో ఉంటారని...వాళ్ళను హ్యాపీగా  బయటికి పంపాలని అలా కాకుండా కుమార్ సాయిని హర్ట్ చేశావు... అది నాకు నచ్చలేదని అమ్మ రాజశేఖర్ అనడం జరిగింది. 

కూరలో కరివేపాకంటే నాకు కోపం రాదా...నా పేరెంట్స్ ఎంత బాధపడి ఉంటారు, అందుకే కుమార్ సాయిని అలా అన్నాను అన్నాడు అఖిల్. ఈ ఎపిసోడ్ మొత్తంలో అఖిల్ కోపం అనేది హైలెట్ అయ్యింది. ఆరియానా సైతం మీకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని...అమ్మ రాజశేఖర్ తో ఆర్గ్యూ చేస్తూ మీరు లైన్ దాటి దగ్గరకు వెళ్లారని అన్నారు. హర్ట్ చేసే విషయాలపై ఇలానే రియాక్ట్ అవుతానని అఖిల్ చెప్పడం జరిగింది. 

ఈ సంఘటనలతో అఖిల్ తనపై ప్రేక్షకాదరణ తగ్గించుకుంటున్నాడు. ఆయన నెగెటివ్ ఇమేజ్ పెంచుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ హోదా పోగొట్టుకుంటున్నాడు. టాప్ 5 కంటెస్టెంట్స్ లో అఖిల్ ఉంటాడనే నమ్మకం ఆడియన్స్ లో సడలిపోతుంది. మరి ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అఖిల్ ఎలిమినేటైనా ఆశ్చర్యం లేదు.