అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై  ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ టైటిల్ తో  రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అఖిల్ కుడి భుజానికి గాయమైంది. గాయం చిన్నదే అయినప్పటికీ వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమన్న వైద్యుల సూచనతో షూటింగును నిలిపివేశారు.
 
సినీ వర్గాల నుంచి అందుతున్న  సమాచారం మేరకు ఈ నెల 10 తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇప్పటికే  70 శాతం షూటింగ్ పూర్తయింది. వేసవి సెలవుల్లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 పిక్సర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తుండగా, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
 
చిత్రం విషయానికి వస్తే...భాస్కర్ శైలిలోనే ఈ సినిమా కూడా సున్నితమైన కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కుతోందట. ఈ చిత్రం కథ వివాహం, దాని ప్రాధాన్యత చుట్టూ తిరగనుంది. అఖిల్ ..అమెరికానుంచి వచ్చిన ఎన్నారై. ఇక్కడ అమ్మాయి ని పెళ్లి చేసుకుని వెళ్లిపోదామనుకుంటాడు. తనకు తగ్గ అమ్మాయిని వెతకటం మొదలెడతాడు. 

ఈ క్రమంలో అతనికి అర్దమయ్యే విషయం...వివాహం అంటే ఓ అమ్మాయిని చేసుకోవటం కాదని, కొన్ని భాధ్యతలతో ముందుకు వెళ్లటం అని అర్దమవుతుంది. పూర్తిగా ఫ్యామిలీ డ్రామాగా నడిచే ఈ సినిమా ఫన్ ఎంటర్టైనర్ గా భాస్కర్ తీర్చిదిద్దుతున్నారు. హీరో,హీరోయిన్స్ క్యారక్టరైజేషన్స్ స్పెషల్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెడ్గే పాత్ర చాలా కీలకమట. ఆమె పాత్ర ఓ స్టాండప్ కమిడియన్ అని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే తెలుగులో ప్రాచుర్యంలోకి వస్తున్నారు స్టాండప్ కమెడయన్స్. ఆ విషయం గమనించిన దర్శకుడు ట్రెండీగా ఉంటుందని ఆ పాత్రను హీరోయిన్ చేత చేయిస్తున్నారు.  
 
అఖిల్ ఈ సినిమాలో అప్పర్ మిడిల్ క్లాస్ యువకుడుగా కనిపించనున్నారు. గీతా గోవిందం తరహాలో ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.