Asianet News TeluguAsianet News Telugu

పారితోషికం తీసుకోకుండా సినిమా చేసిన అఖిల్‌.. `ఏజెంట్‌` అసలు బడ్జెట్‌ వంద కోట్లు.. బాంబ్‌ పేల్చిన నిర్మాత..

అఖిల్‌ అక్కినేని ఇప్పుడు `ఏజెంట్‌` చిత్రంతో రాబోతున్నారు. ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం ఆయన చాలా రిస్క్ కూడా తీసుకున్నారట. 

akhil did not take remuneration for agent shocking statement by movie producer arj
Author
First Published Apr 24, 2023, 7:12 PM IST

అక్కినేని అఖిల్‌ ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం `ఏజెంట్‌`. ఇండియన్‌ స్పై ఏజెంట్‌ కథాంశంతో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 28న విడుదలకాబోతుంది. ముందుగా పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ అనుకున్నారు. ఫైనల్‌ కాపీ రెడీ కాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఇప్పుడు కేవలం తెలుగులోనే విడుదల చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్‌ కానుండగా, ఇప్పటికీ దర్శకుడు సురేందర్‌ రెడ్డి పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ లోనే బిజీగా ఉన్నారు. ఎప్పుడు కంప్లీట్‌ అవుతుందనే టెన్షన్‌  అందరిని వెంటాడుతుంది. 

మలయాళ సూపర్ స్టార్‌ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన `ఏజెంట్‌` చిత్రం సుమారు ఎనబై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇటీవల టీమ్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. అసలు సక్సెస్‌ లేని అఖిల్‌పై ఇంత బడ్జెట్‌ పెట్టడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అయితే యూనివర్సల్‌  అప్పీల్‌ ఉన్న కథ కావడంతో సినిమా నెమ్మదిగా అయినా పాన్‌ ఇండియా రేంజ్‌లో రీచ్‌ అవుతుందని, ఈ బడ్జెట్‌ పెద్ద సమస్య కాదని, థియేట్రికల్‌గా, డిజిటల్‌ పరంగా  సినిమా సేఫ్‌లోనే ఉంటామని మేకర్స్ భావిస్తున్నారట. మమ్ముట్టి ఉండటంతో మున్ముందు మలయాళంలో, యాక్షన్‌, స్పై సినిమా కావడంతో నార్త్ లోనూ వర్కౌట్‌ అవుతుందని, కథ డిమాండ్‌ మేరకు బాగానే ఖర్చు చేశారట. 

అయితే బడ్జెట్‌ అయితే భారీగానే పెట్టారు కానీ ఇప్పుడు రికవరీ సాధ్యమేనా, అసలు సినిమా కనెక్ట్ అవుతుందా? ఆడియెన్స్ ఆదరిస్తారా? అనే అనుమానాలు ఓ వైపు యూనిట్‌ని వెంటాడుతున్నాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి అఖిల్‌ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. సినిమాకి హైప్‌ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్‌ విషయం బయటపెట్టారు నిర్మాత అనిల్‌ సుంకర. ఈ సినిమా నిర్మాణంలో హీరో అఖిల్‌ కూడా భాగమే అని వెల్లడించారు. 

దర్శకుడు సురేందర్‌రెడ్డి సైతం సినిమాలో భాగమయ్యారని, ఆయన మొదట్నుంచి భాగస్వామిగానే ఉన్నారని తెలిపారు. ఇందులో పనిచేసిన అందరు వాళ్ల మొత్తం పారితోషికం తీసుకుంటే ఇది వంద కోట్ల సినిమా అని వెల్లడించారు. అఖిల్‌ కూడా పారితోషికం తీసుకోలేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా వెల్లడించారు. తన పారితోషికాన్ని ప్రొడక్షన్‌ రూపంలో వదులుకున్నారని తెలిపారు. అలా అఖిల్‌, సురేందర్‌రెడ్డి పారితోషికం తీసుకోకుండానే ఈ సినిమాకి పనిచేశారు. ఓ రకంగా ఈ ఇద్దరు భారీ రిస్క్ చేశారు. ఈ విషయంలో నిర్మాత అనిల్‌ సుంకర కొంత రిలీఫ్‌గా ఉన్నట్టు సమాచారం. 

`ఏజెంట్‌` చిత్రంలో హీరో అఖిల్‌ క్యారెక్టర్‌ గురించి ఓ లీక్‌ వార్త చక్కర్లు కొడుతుంది. ఇందులో స్పై గా మమ్ముట్టి కనిపిస్తాడని, మాఫియా మూఠాని పట్టుకోవడం అతని వల్ల కాకపోవడంతో అఖిల్‌ని పంపిస్తాడని, అలా రా ఏజెంట్‌గా అఖిల్‌ మాఫియాని పట్టుకోవడానికి వెళ్తాడని తెలుస్తుంది. అఖిల్‌ ఓ కోతిలాండి వాడని ట్రైలర్‌లో చూపించారు. ఆయన పాత్ర కూడా అలానే కొంటెగా ఉంటుందని, `రేసుగుర్రం`లో అల్లు అర్జున్‌, `కిక్‌`లో రవితేజ పాత్రలను పోలి ఉంటుందని సమాచారం. నిజం ఏంటనేది మరో మూడు రోజుల్లో తేలనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios