ఏజెంట్ మూవీ అనేది దాదాపు అన్ని విభాగాల్లోనూ సరైన విధంగా న్యాయం చేయలేక నిరాశ పరిచిన యాక్షన్ సినిమా. బలహీనమైన స్క్రిప్టు, పేలవమైన దర్శకత్వం, మర్చిపోలేని సంగీతంతో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ దారుణమైన అనుభవాన్ని మిగుల్చింది అంటున్నారు.


అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ గ్రాండ్ గా నిన్న శుక్రవారం రోజు విడుదల అయ్యింది. టాలీవుడ్ లోకి హీరోగా అడుగుపెట్టి చాలాకాలం అవుతున్న ఇంతవరకు అఖిల్ కమర్షియల్ హిట్ కొట్టలేకపోయారు. ఆ మధ్యన వచ్చిన మోస్ట్ బ్యాచ్లర్ సైతం యావరేజ్ తోనే సరిపెట్టుకుంది. ఈ క్రమంలో స్టార్ డైరక్టర్ తో చేసిన ఏజెంట్ మూవీ ఫై అందరిలో ఆశలు పెరిగాయి. అయితే ఊహించని విధంగా ఈ మూవీ కి డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమాను చూసిన ప్రేక్షకులు , అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. దాంతో మేట్నీకే చాలా చోట్ల కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యినట్లు సమాచారం. ఈ క్రమంలో అఖిల్ తదుపరి చిత్రం ఏ డైరక్టర్ తో చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు దర్శకుడు #VamsiPaidipallyతో తన తదుపరి చిత్రం చేయబోతున్నారు. ఈ మేరకు త్వరలో ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇక వంశీ పైడిపల్లి ,విజయ్ హీరోగా రూపొందించిన వారసుడు చిత్రం జస్ట్ ఓకే అనిపించుకుంది. పక్కా కమర్షియల్ సినిమాలు చేసే వంశీ పైడిపల్లి దర్శకుడు కావటంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చే అవకాసం ఉంది.

ఇక ఏజెంట్ మూవీ అనేది దాదాపు అన్ని విభాగాల్లోనూ సరైన విధంగా న్యాయం చేయలేక నిరాశ పరిచిన యాక్షన్ సినిమా. బలహీనమైన స్క్రిప్టు, పేలవమైన దర్శకత్వం, మర్చిపోలేని సంగీతంతో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ దారుణమైన అనుభవాన్ని మిగుల్చింది అంటున్నారు. ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రను చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించగా.. హిప్‌హాప్ తమీజా సంగీతాన్ని అందించాడు.