సైమా అవార్డు కార్యక్రమ వేదికపై పాట పాడిన అఖిల్ హలో సినిమాలోని పాట పాడిన అఖిల్ అఖిల్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్న సినీ ప్రముఖులు
టాలీవుడ్, కోలివుడ్ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు మన సిసింద్రీ గురించే మాట్లాడుకుంటున్నారు. అదేనండి అక్కినేని వారసుడు అఖిల్ గురించి. కేవలం మాట్లాడుకోవడమే కాదు.. పొగడ్తలతో ముంచేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. అఖిల్ నటించిన ‘ అఖిల్’ చిత్రానికి ఆశించిన ఫలితం రాకపోయిన.. తన నటనకు, డ్యాన్సులకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం అఖిల్.. తన రెండో చిత్రం ‘హలో’ షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు.
అసలు విషయానికి వస్తే..
అఖిల్ గత కొంత కాలం క్రితం ‘ సైమా అవార్డుల వేడుక-2017’ లో వేదికపై పాట పాడి అందరనీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ సమయంలో పాట పాడుతున్న అఖిల్ ఫోటో మాత్రమే విడుదల చేశారు. కానీ పాటను విడుదల చేయాలేదు. ఇప్పుడు సైమా అవార్డ్స్ నిర్వాహకులు యూట్యూబ్ లో పోస్టు చేశారు.
ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్స్ లో 35వ స్థానంలో నిలిచింది. తన చిత్రం హలో లోని ‘ ఏవేవో కలలు కన్నా. ఏవైపో కదులుతున్న’ పాట పాడారు. ఈ పాటను విన్న పలువురు సినీ ప్రముఖులు అఖిల్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
సందర్భంగా అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి, అరవింద్ స్వామి, అనూప్ రూబెన్స్, సుమంత్, సాయేషా సైగల్ తదితరులు ట్విటర్ వేదికగా అఖిల్‌ను ప్రశంసించారు. ‘చంపేశావ్.. అఖిల్’ అని అరవింద్ స్వామి ట్వీట్ చేశారు.
