అఖిల్ 'మిస్టర్ మజ్ను'!

Akhil Akkineni's upcoming film titled 'Mr Majnu'?
Highlights

 'తొలిప్రేమ' చిత్రంతో దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించిన వెంకీ అట్లూరి ఈసారి కూడా లవ్ స్టోరీనే ఎంపిక చేసుకున్నాడు. ఎక్కువ భాగం సినిమా విదేశాల్లోనే షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకు టైటిల్ గా 'మిస్టర్ మజ్ను' అనే పేరుని ఫైనల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి

అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ 'అఖిల్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ఈ సినిమా తరువాత 'హలో' అనే మరో సినిమాలో నటించాడు అఖిల్. ఈ సినిమా పర్వాలేదనిపించినా..  కలెక్షన్స్ పరంగా వర్కవుట్ కాలేదు. దీంతో తన మూడో సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అఖిల్.

వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 'తొలిప్రేమ' చిత్రంతో దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించిన వెంకీ అట్లూరి ఈసారి కూడా లవ్ స్టోరీనే ఎంపిక చేసుకున్నాడు. ఎక్కువ భాగం సినిమా విదేశాల్లోనే షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకు టైటిల్ గా 'మిస్టర్ మజ్ను' అనే పేరుని ఫైనల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో నాగార్జున హీరోగా నటించిన 'మజ్ను' సినిమా మంచి విజయం సాధించింది. ఆ సెంటిమెంట్ తోనే అఖిల్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి చిత్రబృందం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ సినిమాలో అఖిల్ కి జంటగా నిధి అగర్వాల్ నటించనుంది. 

loader