Asianet News TeluguAsianet News Telugu

‘ఏజెంట్’ ఏ OTT లో ఎప్పటి నుండి స్ట్రీమింగ్? !

 కొత్త సినిమాలు ఎగ్రిమెంట్ ప్రకారం ఐదు  వారాల తర్వాత స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ సమ్మర్ హాలిడేస్ ఉండటం వల్ల ఓటీటీల వ్యూయర్ షిప్ బాగుంటుంది.  సాధ్యమైనంత త్వరగా ఓటీటీ సంస్థలు.. తాము కొనుగోలు చేసిన సినిమాలను స్ట్రీమింగ్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నాయి.

Akhil Akkineni Agent Movie on OTT from this time
Author
First Published Apr 30, 2023, 1:21 PM IST


అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్’ సినిమా మొన్న శుక్రవారం అంటే ఏప్రిల్ 28న విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ వచ్చింది. రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి. ఫస్టాఫ్ ఓకే అనుకున్నా సెకండాఫ్ చూడటం కష్టం అని తేల్చేసారు.ఎవరేమన్నా బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది. అయితే రెండో రోజు నుంచే డ్రాప్ స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలో నెగిటివ్ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవటంతో వీకెండ్ చూద్దామనుకున్న వాళ్లు కూడా ఆగిపోయారు. చాలా మంది ఓటిటిలో చూద్దామని ఫిక్స్ అవుతున్నారు. ఈ క్రమంలో ఓటిటిలో ఎప్పుడు వస్తుంది .ఏ ఓటిటిలో  రావచ్చు అనే విషయం చర్చగా మారింది. 

మీడియా వర్గాల నుంచిఅందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుందట. మొదట 4 వారాల్లో (Agent) ‘ఏజెంట్’ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు. కానీ ఇప్పుడున్న నెగిటివ్ టాక్ తో 4 వారాల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వినికిడి. అంటే  మే 19 , 20 తేదీల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయిది. కొత్త సినిమాలు ఎగ్రిమెంట్ ప్రకారం ఐదు  వారాల తర్వాత స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ సమ్మర్ హాలిడేస్ ఉండటం వల్ల ఓటీటీల వ్యూయర్ షిప్ బాగుంటుంది. అందుకోసమే సాధ్యమైనంత త్వరగా ఓటీటీ సంస్థలు.. తాము కొనుగోలు చేసిన సినిమాలను స్ట్రీమింగ్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నాయి.

ఇక కొన్ని పాయింట్స్ స్టోరీ లైన్ గా వింటానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి. వాటిని ట్రీట్మెంట్ చేసి తెరపైకి తీసుకు వచ్చేసరికి తల ప్రాణం తోకకు వస్తుంది. ఓ టైమ్ లో ఏం చెయ్యాలో..ఎటు వెళ్లాలో తెలియక కన్ఫూజన్ ఏర్పడుతుంది. ప్రాజెక్టుని వదిలేయలేం..ముందుకు వెళ్లలేము అనే పరిస్దితి. అలాంటి సిట్యువేషనే ఏజెంట్ కు వచ్చినట్లుంది. అఖిల్ ఎంతో ఆశపెట్టుకుని సిక్స్ ప్యాక్స్ పెంచి మరీ చేసిన ఈ  సినిమా ఆశలపై నీళ్లు చల్లేసినట్లు కనపడుతోంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాని డైరక్టర్ చేసినా, మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా ప్రత్యేక పాత్రలలో కనిపించినా కలిసి రాలేదు. షూటింగ్ మరియు ఫారన్ లొకేషన్ ల మీద పెట్టిన ఫోకస్ సురేందర్ రెడ్డి కథ ,స్క్రీన్ ప్లే మీద మాత్రం పెట్టలేకపోయారు. కథ చాలా రెగ్యులర్,రొటీన్  గా అనిపిస్తుంది. ఎలాంటి కొత్తదనం లేకుండా అదే అవుట్ డేటెడ్ కథ,దానికి తోడు కన్ఫూజన్ . పోనీ ఆ పాత కథను స్క్రీన్ ప్లే తో మాయ చేయగలిగారా అంటే అది లేదు. తెరపై  స్లోగా నడుస్తూ కథ,కథనం కదలకపోవటంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తోంది.ఇంతకీ చిత్రం కథేమిటంటే...
  
 రామకృష్ణ అలియాస్ రిక్కీ అలియాస్ వైల్డ్  (అక్కినేని అఖిల్) కి ఒకటే జీవితాశయం. అది ఇంజిలిజెంట్ వింగ్ అయిన రా ఏజెంట్ అవ్వాలని.ఆ క్రమంలో  తాను రా ఏజెంట్ అవ్వడానికి చేసే ప్రతీ ప్రయత్నం ఫెయిల్ అవుతూంటుంది.చివరగా తన అతి తెలివి ను ఉపయోగించి  'రా' చీఫ్ డెవిల్ అలియాస్ మహాదేవ్ (మమ్ముట్టి) సిస్టమ్స్ ని హ్యాక్ చేసి అతని దృష్టిలో పడతాడు. ఆ సమయంలో  డెవిల్...ఓ స్పై  ఆపరేషన్ సన్నాహాల్లో ఉంటాడు. గాడ్ అలియాస్ ధర్మ (డినో మోరియా) దేశానికి వినాశనంగా తయారయ్యాడని అతన్ని కంట్రోలు చేసేందుకు తన ఏజెంట్స్ ని పంపుతూంటాడు. కానీ వాళ్లెవరూ సక్సెస్ కారు. అప్పుడు డెవిల్ కు ఓ ఆలోచన వస్తుంది. దాదాపు కోతిలా ఎప్పుడు అల్లరి చేస్తూ స్పై అవ్వాలనే ఆలోచనలో ఉన్న రిక్కీని ... స్పైగా ..గాడ్ ని నాశనం చేయటానికి పంపుతాడు. ఆ మిషన్ లో రిక్కీ సక్సెస్ అయ్యాడా..అసలు స్పై అవ్వాలని రిక్కీ అలోచనల వెనక అసలు కథేంటి... డెవిల్ గాడ్ మధ్యలో ఎవరు గెలిచారు? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios