Asianet News TeluguAsianet News Telugu

క్రేజీ అప్డేట్ తో వచ్చిన అఖండ టీం!

అఖండ టీం నేడు మూవీపై అప్డేట్ ఇచ్చారు. అఖండ షూటింగ్ పూర్తి చేసినట్లు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. అలాగే త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నట్లు హింట్ ఇచ్చారు. 

akhanda team wraps up shoot gearing up for release
Author
Hyderabad, First Published Oct 5, 2021, 2:25 PM IST


బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం అఖండ. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చిత్రం తెరకెక్కుతుండగా, చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఆకట్టుకున్నాయి. లుక్ పరంగా కూడా బాలయ్య కేక పుట్టించాడు. రెండు విభిన్నమైన గెటప్స్ లో బాలకృష్ణ సందడి చేయనున్నారని సమాచారం. 
ఇక అఘోరాగా బాలయ్య ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. 

కాగా అఖండ టీం నేడు మూవీపై అప్డేట్ ఇచ్చారు. అఖండ షూటింగ్ పూర్తి చేసినట్లు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. అలాగే త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నట్లు హింట్ ఇచ్చారు. దీనితో బాలయ్య సంక్రాంతి బరిలో దిగుతాడా? లేక క్రిస్మస్ పండుగకు వస్తాడా? అనే సందిగ్ధం మొదలైంది. 


కరోనా సెకండ్ వేవ్ కారణంగా అఖండ షూటింగ్ డిలే అయిన విషయం తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే గత సమ్మర్లోనే అఖండ థియేటర్స్ లో దిగేది. సింహ, లెజెండ్ విజయాల తరువాత బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ. మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios