Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య ‘అఖండ’ కొత్త రిలీజ్ డేట్

బాలకృష్ణ  హీరోగా తెరకెక్కుతున్న ‘అఖండ’ శరవేగంగా ముస్తాబవుతోంది. దీపావళికి సందడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టాకీ భాగం షూటింగ్ పూర్తయింది. కొన్ని పాటలు మాత్రమే తెరకెక్కించాల్సి ఉంది. అందుకోసం సన్నాహాలు ఊపందుకున్నాయి.
 

Akhanda Locks A New Release Date
Author
Hyderabad, First Published Oct 4, 2021, 9:48 AM IST

 నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. ఈ కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ హిట్స్ సాధించడంతో అఖండ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. కరోనా వేవ్ తర్వాత శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరిదశలో ఉండగా, రెండు పాటల షూటింగ్ బ్యాలన్స్ వుంది. ప్రస్తుతం చిత్ర టీమ్ విడుదల తేదీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా దీపావళి పండగకు రానున్నట్లు తెలుస్తోంది. దసరా కానుకగా ప్లాన్ చేసినా షూటింగ్ పూర్తి కాకపోవటంతో కుదరలేదు. దీంతో దీపావళి సమయానికి ఈ చిత్రం పక్కాగా రిలీజ్ చేయాలని  ఫిక్స్ అయ్యారట. మొదట సంక్రాంతికి రిలీజ్ అనుకున్నా.... భారీ సినిమాలు పోటీలో ఉండటంతో ఆ రేసు నుంచి తప్పుకొంది. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా కూడా డిసెంబర్ 17న రానున్నట్లు ప్రకటించింది. దీంతో బాలయ్య సినిమా దీపావళికి దాదాపు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా కూడా దీపావళి రేసులో లేకపోవడంతో బాలయ్య ‘అఖండ’ సినిమాకు ఏ భారీ సినిమా కూడా పోటీ లేనట్లు కనిపిస్తోంది.  

సూపర్ హిట్టైన ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ హీరోయిన్స్. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ - గోపీచంద్‌ మలినేని కలయికలో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత బాలకృష్ణ చేయనున్న చిత్రం ఖరారైన విషయం తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు.

 ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా తెలుస్తోంది.   ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల కు అమ్ముడయ్యాయి, నైజాం ప్రాంతం రూ. 10 కోట్లుకు అమ్మడు అయ్యాయని... సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని చెప్తున్నారు.  

మరో ప్రక్క ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. అఖండ షూటింగ్ పూర్తి అవ్వడంతో ఇక బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios