న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `అఖండ`. ఈ సినిమాపై రిలీజ్ కు ముందు నుంచే భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `అఖండ`. ఈ సినిమాపై రిలీజ్ కు ముందు నుంచే భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ‘సింహా’, ‘లెజెండ్‌’తర్వాత ఈ హిట్‌ కాంబోలో హ్యట్రిక్‌ మూవీ కావడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో ‘అఖండ’పై హైప్‌ క్రియేట్‌ అయింది.భారీ అంచనాల మధ్య గురువారం(డిసెంబర్‌ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అఖండ’ప్రేక్షకులను మైమరిపించింది. సినిమా మొత్తం బాలకృష్ణ వన్‌మేన్‌ షో అనే చెప్పాలి. 

గ్రామ పెద్ద మురళీ కృష్ణగా, అఖండగా రెండు విభిన్న పాత్రలో కనిపించిన బాలయ్య.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. ‘జైబాలయ్య’పాటకు ఆయన వేసిన స్టెప్పులు, అఖండ రూపంలో చేసే ఫైట్స్‌ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి. ఈ నేపధ్యంలో సినిమా సూపర్ హిట్టైంది. అలాగే ఈ సినిమా ఓటిటిలోనూ పెద్ద హిట్టైంది. అయినా ఇంకా ఓ థియోటర్ లో ఈ సినిమా నాలుగు షోలు పడుతూండటం విశేషం. ఏకంగా 175 రోజులు థియేటర్‌లో నడిచిన సినిమాగా అఖండ నిలవనుంది.

గుంటూరులోని చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో మాత్రం అఖండ ఇంకా నాలుగు షోలలో నడుస్తుండడం విశేషం. పైగా ప్రతీ షోకు ప్రేక్షకులు వస్తుండడంతో థియేటర్ యాజమాన్యం దీనిని 175 రోజులు నడిపనుంది. గతంలో సీడెడ్ ఏరియాలో బాలయ్య నటించిన 'లెజెండ్' కూడా ఇదే తరహాలో 100 రోజులు ఆడింది. ఇప్పుడు మళ్లీ ఆ క్రెడిట్ అఖండకే దక్కుతోంది. ఇక అఖండ 103 సెంటర్లలో 50 రోజులు ఆడింది. 20కు పైగా సెంటర్లలో అఖండ 100 రోజులు పూర్తిచేసుకుంది. కర్నూలులో 100 డేస్ సెలబ్రేషన్స్ కూడా చేశారు బాలయ్య ఫ్యాన్స్.

 మరో ప్రక్క ఈ సినిమా సీక్వెల్ కు ప్లానింగ్ జరుగుతున్నట్లు వినికిడి. ఈ సినిమా క్లైమాక్స్​లో 'ఈ జన్మకి శివుడే నాకు తండ్రి. ఆ లోకమాతే నాకు తల్లి' అంటూ అఖండ తన బంధాలన్నింటినీ తెంచేసుకుని వెళ్లిపోతాడు. కానీ.. వెళ్లే ముందు మాత్రం సినిమాలో కీలక పాత్ర అయిన మరో బాలకృష్ణ కూతురికి మాట ఇస్తాడు. 'నీకు ఆపద వచ్చినప్పుడు నీ ముందు ఉంటాను' అని చెప్తాడు. సీక్వెల్‌ని తెరకెక్కిస్తే ఈ మాట ఆధారంగా పాపకు మరో సమస్య రావడం, అఖండ పునరాగమనం చేసే అవకాశం ఉందని ఫిలింనగర్‌ టాక్‌. సినీ వర్గాల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది.