‘అఖండ’ కొత్త రిలీజ్ డేట్,లేటే అనిపిస్తోంది

ఎన్‌బీకే - బోయపాటి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వస్తోన్న ‘అఖండ’లో ప్రగ్యా జైస్వాల్‌  హీరోయిన్. శ్రీకాంత్‌, పూర్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన #బీబీ3 ఫస్ట్ రోర్‌తో పాటు ఇటీవల విడుదలైన టీజర్‌ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది.
 

Akhanda Eyeing A New Release Date jsp

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా.. కరోనా ఉద్ధృతి వల్ల తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులన్నీ కుదుట పడటంతో మిగిలిన షూట్‌ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జులై తొలి వారం నుంచి హైదరాబాద్‌లో ఈ ఆఖరి షెడ్యూల్‌ ప్రారంభించనున్నారని సమాచారం.

 ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడనేది మీడియా వర్గాల్లో,ట్రేడ్ లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మే 28 న ఈ సినిమా రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్‌ ఆ పని కానివ్వలేదు. ఈ నేపధ్యంలో చిత్రం టీమ్ మరో తేదీని ఎంచుకుందని సమాచారం. క్లైమాక్స్ పార్ట్ పెండిండ్ ఉండటంతో దాన్ని పూర్తి చేసి సెప్టెంపర్ 10 వినాయిక చవితి రోజు ఈ సినిమాని రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారని చెప్పుకుంటున్నారు. అధికారికంగా అయితే ప్రకటన ఏమీ లేదు. 

ఇందులో భాగంగా ఓ పాటతో పాటు కొన్ని కీలక యాక్షన్‌ సన్నివేశాలు తెర కెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ ముందు వరకు వికారాబాద్ అడవుల్లో ప్లాన్ చేసారు. శ్రీకాంత్‌తో పాటు మరి కొంత ఆర్టిస్టులపై క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా జూలై 1 నుంచి 40 రోజుల పాటు గండిపేటలో ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన షెడ్యూల్‌ను షూట్ చేయనున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కానుంది. అయితే రిలీజ్‌ విషయంలో దసరాని కూడా టార్గెట్‌చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. మరి చివరికి దేనికి ఫిక్స్ అవుతారనేది చూడాలి. 

ఈ సినిమా కూడా పగ ప్రతీకారాల నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ సినిమాలో అఘోరగా బాలయ్య పాత్ర హైలెట్ అని చెబుతున్నారు. బాలయ్య ఈ చిత్రంలో రెండు శక్తిమంతమైన పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. వరదరాజులు అనే విలన్ గా శ్రీకాంత్‌ కనిపిస్తారు. ఇందులో ఆయన గెటప్‌.. పాత్ర చిత్రణ చాలా కొత్తగా ఉండనున్నాయని సమాచారం. ఈ సినిమాకి సంగీతం: తమన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: రామ్‌ ప్రసాద్‌.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios