పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా రెండవ సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. పూరి తెరకెక్కించిన మొదటి సినిమా మెహబూబా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఈ సారి పూరి డైరక్షన్ జోలికి వెళ్లడం లేదు. తన శిష్యుడు అనిల్ కి డైరెక్షన్ పనులు అప్పగించి తనయుడితో రొమాంటిక్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. 

ఈ సినిమాకు  కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథ్ అందిస్తున్నారు.అయితే సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన రొమాంటిక్ టీమ్ పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటోంది. పూరి స్టైల్ లోనే ఈ సినిమా తెరక్కేకుతున్నట్లు క్లారిటీగా చెప్పేశారు.ఆకాష్ కు జోడిగా ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మ నటిస్తోంది. ఈ భామకు ఇన్స్టాగ్రామ్ లో 1.6M ఫాలోవర్స్ కూడా ఉన్నారు. 

ఇన్స్టాలో హాట్ ఫొటోస్ తో రెచ్చిపోయే మోడల్ ఇప్పుడు ఆకాష్ పూరితో హార్డ్ రొమాంటిక్ గా దర్శనమిచ్చింది. ఇక సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశలో ఉంది.  పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి కూడా సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా టీజర్ ని రిలీజ్ చేసి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.