అటు సినిమాలు.. ఇటు స్పోర్డ్స్.. రెండింటిని రెండు కళ్ళుగా భావిస్తాడు హీరో అజిత్. ఆయన బైక్ పై చేసే సాహసయాత్రలు ఎవరికీ సాధ్యం కాదు అనే చెప్పాలి. ఈక్రమంలో మరో భారీ టూర్ కు శ్రీకాంరం చుట్టాడు అజిత్. 

అటు సినిమాలు.. ఇటు స్పోర్డ్స్.. రెండింటిని రెండు కళ్ళుగా భావిస్తాడు హీరో అజిత్. ఆయన బైక్ పై చేసే సాహసయాత్రలు ఎవరికీ సాధ్యం కాదు అనే చెప్పాలి. ఈక్రమంలో మరో భారీ టూర్ కు శ్రీకాంరం చుట్టాడు అజిత్. 

రేసింగ్ అంటే ఎంతో ఇష్టపడే అతి తక్కువ ప్రముఖ హీరోలలో అజిత్ కూడా ఒకరు. కాస్త ఖాళీ దొరికితే చాలు బైక్ పట్టుకుని తన ప్రపంచంలోకి వెళ్ళిపోతుంటాడు. ముఖ్యంగా దేశవ్యాప్తం పర్యటనలు.. అది కూడా బైక్ పై వెళ్ళడం అంటే చాలా ఇష్టం. నార్త్ సౌడ్ ఉత్తర ప్రదేశ్, తో పాటు విదేశాలు అయిన నేపాల్, భూటాన్ లకు కూడా బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్ళాడు అజిత్. 

గతంలో కూడా వైజాగ్ లో షూటింగ్ జరిగినప్పుడు అక్కడి షూటింగ్ కంప్లీట్ చేసుకుని. వైజాగ్ నుంచి కాశ్మీర్ లోని లడాక్ వరకూ రైడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక ఇప్పుడు మరోసా వెళ్లారు. ఈ నటుడు మరోసారి బైక్ పై సాహస యాత్రకు సిద్ధమవుతున్నారట. అజిత్ ప్రపంచ యాత్ర చేయనున్నట్లు ఆయన మేనేజర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.

అజిత్ ఇప్పటికే బైక్‌పై ఎన్నో సాహస యాత్రలు చేశారని, సవాళ్లతో కూడిన భూభాగంలో ప్రయాణించారని, తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నారని, ఇటీవల పలు ప్రాంతాల్లో పర్యటించారని పేర్కొన్నారు. త్వరలో ఆయన మరో యాత్రకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ నుండి అజిత్ తన బైక్ ‌పై ప్రపంచ యాత్రకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ సాహస యాత్ర కోసం అజిత్ ఓ తమిళ సినిమా షూటింగ్ ను చాలా స్పీడ్ గా షూట్ యేశాడు.