సౌత్ ఇండియా స్టార్స్ లో అజిత్ మొదట నుంచి డిఫరెంట్ గానే ఉంటూ వస్తున్నారు. సినిమాలు తో పాటు సమాజంలోనూ మంచి మార్పుని కోరుకుంటారు. అందుకే ఆయనకు తమిళనాట ఓ రేంజిలో ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆయనకు మహిళా అభిమానులు కూడా ఎక్కువే. తన సినిమాల్లోనూ మహిళలకు పెద్ద పీట వేసే ఆయన నిజ జీవితంలో వాళ్ల పట్ల అదే గౌరవం చూపుతారు. 

అయితే ఆయన చేసే మాస్ సినిమాల్లో మహిళ పాత్రలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వటం కుదరదు. ఇది గమనించి ఆయన మహిళా ప్రధాన చిత్రంగా వచ్చిన పింక్ రీమేక్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్ విడుదల సందర్బంగా మాట్లాడుతూ తనకు మహిళలంటే ఎంత గౌరవమో మరోసారి తెలియచేసారు.

అజిత్ మాట్లాడుతూ.... నా కెరీర్ ఆరంభంలో మహిళల పాత్రల్ని ఇబ్బందిపెట్టే తరహా పాత్రలు చేశాను. ఆ తప్పుకు ఇప్పుడు బాధపడుతున్నాను. ఆ తప్పును సరిదిద్దుకుని, మహిళల్ని గౌరవించే పాత్రలో ఆదర్శంగా నిలవడానికి ఈ ‘నెర్కొండ పార్వై’ చిత్రం చేస్తున్నాను అన్నారు.

ఇలా  అజిత్ ఇంత బాహాటంగా తన పొరపాటుని ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుండటంతో అభిమానుల్లో ఆయనపై గౌరవం మరింతగా పెరిగింది.  ఈ స్టేట్మంట్  ని ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారు.

అజిత్ ప్రస్తుతం హెచ్. వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ ‘పింక్’ యొక్క తమిళ రీమేక్ ‘నెర్కొండ పార్వై’లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ నిన్నే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.