Asianet News TeluguAsianet News Telugu

‘తెగింపు’కే గోల్డెన్ ఛాన్స్ , భారీగా తెలుగు థియేటర్స్ లో.. తెర వెనక మ్యాటర్

 అజిత్ తునివు చిత్రానికి మాత్రం అర్ధరాత్రి 1 గంటకే ప్రీమియర్స్ పడబోతున్నట్లు తెలుస్తోంది. 

Ajith Golden opportunity for #Tegimpu movie
Author
First Published Jan 10, 2023, 7:28 AM IST


ఈ సంక్రాంతి పండగ బరిలో హీరో అజిత్ కుమార్ మరోసారి తనకు ఎంతగానో కలిసొచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ జోనర్‌తో మనముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తునివు’(తెలుగులో తెగింపు)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ హీరో. ఈ సినిమా ట్రైలర్ అభిమానుల్లో అదిరిపోయే బజ్ క్రియేట్ చేసింది. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అజిత్ చేసిన యాక్షన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు ఉవ్విళ్లూరుతున్నారు.   పొంగల్ కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అయ్యింది. 

ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అసలు థియేటర్స్ దొరుకుతాయా లేదా....ఓపినింగ్స్ వస్తాయా..ప్రమోషన్ లేదే అని అందరూ కామెంట్స్ చేసారు. కానీ సంక్రాంతి రేసులో మొదటగా ఈ సినిమానే ఇక్కడ రిలీజ్ అవటం కలిసివస్తోంది. ఓ రకంగా ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకు పోటీగా ఏ సినిమా లు మరో రెండు రోజులు దాకా ఉండవు. కాబట్టి టాక్ బాగుంటే కుమ్మేసుకోవచ్చు. అలాగే కావాల్సినన్ని థియేటర్స్ రిలీజ్ రోజు దొరుకుతున్నాయి. దాంతో ఈ మద్యకాలంలో  తెలుగులో ఏ ఇతర డబ్బింగ్ సినిమా రిలీజ్ కానీ రీతిలో భారీగా అవుతోంది. అదిరిపోయే ఓపినింగ్స్ వస్తాయని ట్రేడ్ అంచనా వేస్తోంది.
 
ఇక‘తెగింపు’ కోసం తమిళ అభిమానులు తో పాటు తెలుగు వారు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వారి అంచనాలకు ఏమాత్రం తగ్గుకుండా ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.  అజిత్ తునివు చిత్రానికి అర్ధరాత్రి 1 గంటకే ప్రీమియర్స్ పడబోతున్నట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి తెగింపు  చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ఈ సినిమాకు వస్తున్న  బిజినెస్ చూసి, ఈ సినిమాను అనుకున్నదానికంటే ముందుగానే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే అజిత్ తునివు చిత్రాన్న జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. దీంతో పొంగల్ రిలీజ్ లలో అజిత్ ముందుగా దిగుతున్నాడు. ఈ మేరకు నిర్మాత బోనీ కపూర్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశాడు.   
 

Follow Us:
Download App:
  • android
  • ios